E-Paper
Advertisement

Amarnath Shivling : 90 అడుగుల ఎత్తైన గుహలో మంచు లింగం

Amarnath Shivling : 90 అడుగుల ఎత్తైన గుహలో మంచు లింగం
Advertisement

Amarnath Shivling : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ‘అమర్‌నాథ్‌ గుహ’. జమ్మూ, కాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక పవిత్ర గుహ. ఇక్కడ శివుడు మంచు లింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. వేసవిలో కొన్ని రోజులు మినహా ఏడాది పొడవునా ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది. మరి మంచు శివలింగం విశేషాలేంటో చూసేద్దామా!

పురాణం ప్రకారం.. ఓసారి పార్వతీ దేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుడిని అడిగితే.. కథ చెప్పడానికి అమర్‌నాథ్ గుహను ఎంచుకుంటాడు. ఆ తర్వాత పార్వతి సమేతంగాఅమర్‌నాథ్ గుహకు చేరుకుంటారు. ఆ అమర కథను మరెవరూ వినకుండా.. గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్నిని ఆదేశించాడు. ఆ తర్వాత శివుడు పార్వతికి అమరత్వం కథను చెప్పాడు. అయితే, ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయట.

Advertisement

ఈ పవిత్ర గుహలో మంచుతో సహజ సిద్ధంగా ఏర్పడిన లింగంలో శివపార్వతులు నేటికీ దర్శనమిస్తున్నారు. ఈ పవిత్ర గుహ అమర్‌నాథ్ పర్వతంపై 17 వేల ఎత్తులో ఉంది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 141 కి.మీ. దూరంలో ఉంది. ఆధునిక పరిశోధకుల ప్రకారం.. అమర్‌నాథ్ గుహను 1850లో బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు. 1898లో స్వామి వివేకానంద అమర్‌నాథ్ గుహను సందర్శించినట్లు ‘నోట్స్ ఆఫ్ సమ్ వండరింగ్ విత్ స్వామి వివేకానంద’లో సోదరి నివేదిత పేర్కొన్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×