E-Paper
Advertisement

HBD Anushka Shetty : వెండితెర జేజమ్మ.. హ్యాపీ బర్త్ డే స్వీటీ ..

HBD Anushka Shetty :  వెండితెర జేజమ్మ.. హ్యాపీ బర్త్ డే స్వీటీ ..
Advertisement
sweety birthday wishes

HBD Anushka Shetty : సూపర్ మూవీ నుంచి మిర్చి వరకు.. అరుంధతి నుంచి బాహుబలి వరకు.. క్యూట్ గా ఉండే స్వీటీ అయినా.. భయం పుట్టించే భాగమతి అయినా.. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ గా నటించగలిగే నటి అనుష్క శెట్టి. టాలీవుడ్ లో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అనుష్క శెట్టి. స్టార్ హీరోలతో దీటుగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న యాక్టర్ అనుష్క. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నాగార్జున సూపర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలో దక్షిణాది టాప్ హీరోయిన్స్ స్టేటస్ సంపాదించుకుంది.

Advertisement

మొదట్లో గ్లామర్ షో ఎక్కువ చేసినా.. తరువాత ఎక్కువగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ వస్తుంది. మరి ముఖ్యంగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్క సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపు తెప్పింది. జేజమ్మగా అనుష్క టాలీవుడ్ పై చెరగని ముద్ర వేసింది. కొన్ని సినిమాలకు రీమేక్లు ఉండవు.. అలాంటి వాటిలో అరుంధతి మూవీ ఒకటి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అందులో జేజమ్మ అంటే అనుష్కనే ..ఇంకొక రీప్లేస్మెంట్ లేదు.

బాహుబలి లో దేవసేన క్యారెక్టర్ అనుష్క కెరియర్ లో మరొక మైలురాయి. ఈ మూవీతో ఒక్కసారిగా అనుష్క ఫ్యాన్ ఇండియన్ నటిగా మారింది. కత్తి పట్టినా.. గుర్రం ఎక్కినా.. యుద్ధం చేసినా.. ఆ రాజసం అనుష్కకు సొంతం. మంగళూరులో పుట్టిన అనుష్క విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులో జరిగింది. రీసెంట్ గా విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

సినీ కెరియర్ లో ఎటువంటి కాంట్రవర్సీ లేని ఈ నటి కేవలం ఒకే ఒక స్టార్ విషయంలో పలుమార్లు వార్తలో నిలుస్తుంది. ఆ హీరో ఎవరో గెస్ చేసారా.. మన డార్లింగ్ ప్రభాస్ అండి. అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అన్న అందరికీ తెలుసు. ఆన్ స్క్రీన్ వీళ్ళ కెమిస్ట్రీకి ఎదురేలేదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడు కెమెరా కంటికి చిక్కిన నెటిజన్లు ఆ ఫోటోలను ఫుల్లుగా వైరల్ చేస్తారు.

ఇక రీసెంట్ గా ఏఐ సాక్షిగా ..ప్రభాస్, అనుష్కకు పెళ్లయి పిల్లలు పుడితే ఎలా ఉంటారు అన్నంతవరకు ఫొటోస్ ని జనరేట్ చేసి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు డార్లింగ్ ఫాన్స్. అయితే తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ అని అనుష్క, ప్రభాస్ ఎన్నో సార్లు స్పష్టం చేశారు. అయినా టాలీవుడ్ మొత్తం ఈ జంట ఎప్పటికైనా ఒకటి అవుతారేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంది.

ఈ వెండితెర జేజమ్మకు ఈరోజు పుట్టినరోజు.. ఈ సందర్భంగా బిగ్ టీవీ తరఫున స్వీటీకి క్యూట్ బర్త్డే విషెస్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×