BigTV English

Features of Honda EM1:హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ తెలుసా?

Features of Honda EM1:హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ తెలుసా?

Features of Honda EM1:జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా… తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ EM1ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ ఏడాది జూన్-ఆగస్ట్ మధ్య EM1ను అందుబాటులోకి తీసుకురాబోతున్న హోండా… ఆ తర్వాత స్కూటర్‌ను మనదేశంలోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుత ధర ప్రకారం EM1 ధర 985 యూరోలు. అంటే మన కరెన్సీలో రూ.87 వేలు. లక్ష రూపాయల కన్నా తక్కువ ధర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో హోండా EM1 గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.


రెండు వేరియంట్లలో హోండా EM1 అందుబాటులోకి రానుంది. 1.2 కిలోవాట్, 1.8 కిలోవాట్ బ్యాటరీలతో EM1 మోడళ్లు రానున్నాయి. బ్యాటరీలను వాటి జీవిత కాలంలో 3 వేల సార్లు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉందని హోండా చెబుతోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని చెబుతోంది. అంటే… హోండా EM1ను బ్యాటరీ మార్చకుండా లక్షా 20 వేల కిలోమీటర్ల వరకు నడుపుకునే అవకాశం ఉందన్నమాట. అంతేకాదు… మొబైల్ పవర్ ప్యాక్‌లో భాగంగా EM1 బ్యాటరీలను తయారు చేయడంతో… వాటిని ఈజీగా స్వాపింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. బ్యాటరీలను మార్చుకునే సదుపాయం… హోండా, కవాసకి, యమహా, సుజుకీల మధ్య ఏర్పడిన కన్సార్టియంకు అనుగుణంగా ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల సమయం పడుతుందని హోండా చెబుతోంది.

ఇక EM1 ఇతర స్పెసిఫికేషన్లు చూస్తే… ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్-షాక్ అబ్జార్బర్స్ ఉన్న రియర్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్, 10 అంగుళాల చక్రాలు, యాంటీ థెప్ట్ అలారం, యూఎస్‌బీ పోర్ట్ అమర్చారు. సీటు ఎత్తు కేవలం 740 మిల్లీమీటర్లు మాత్రమే ఉండటంతో… హైట్ తక్కువ ఉన్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.


Capita Income : మోడీ హయాంలో రెట్టింపైన తలసరి ఆదాయం.. ఎంతో తెలుసా?

Elon Musk : మస్క్‌కు షాకిచ్చిన ఎఫ్‌డీఏ

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×