BigTV English

Grahanam : గ్రహణం రోజున దానాలు చేస్తే కలిగే ఫలితాలేంటో తెలుసా?

Grahanam : గ్రహణం రోజున దానాలు చేస్తే కలిగే ఫలితాలేంటో తెలుసా?

Grahanam : ఈ ఏడాదిలో 15 రోజుల వ్యవధిలోనే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చాయి. ఈ గ్రహణాల ప్రభావం రాబోయే కాలంలో ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పాక్షిక చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారిపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాంటి వారి గ్రహణ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కొన్ని నివారణ మార్గాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది.


గ్రహణం ముందు రోజు మనం దానం చేయాలనుకున్న వస్తువులను బయటపెట్టి గ్రహణం మరుసటి రోజు ఆ వస్తువులను దానం చేయటం వల్ల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి చంద్ర గ్రహణ సమయంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలి అనే విషయానికి వస్తే… ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు తెల్లటి ముత్యాలను దానం చేయడం ఎంతో మంచిది. ఇలా ముత్యాలను కాకపోయినా ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలను దానం చేయడం మంచిది..

ఇకపోతే గ్రహణం తర్వాత అంటే రేపు తెల్లటి బియ్యం, చక్కెర,పాలు వంటి పదార్థాలను దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోవడమే కాకుండా మన గృహంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.మన ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉంటే కనుక ఆ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఒక గాజు గ్లాసులో వెండి నాణెం వేసి అందులో పాలు వేసి ఆ పాలను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తాగించాలి. అనంతరం ఆ గిన్నెతో పాటు వెండి నాణెం కూడా దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇలా చంద్రగ్రహణ సమయంలో ఈ దానాలను చేయటం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. గ్రహణ సమయాలలో మనం ఏదైనా దానధర్మాలను చేస్తే మనం పడే ఇబ్బందుల నుంచి దోషాల నుంచి బయటపడతాం.


గ్రహణ సమయం:
స్పర్శ కాలం మధ్యాహ్నం 2:38
మధ్య కాలం మధ్యాహ్నం 4:28
మోక్ష కాలం సాయంత్రం 6:18
ఆద్యంత పుణ్యకాలం 3:40.

చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఇది కనపడుతుంది.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

Related News

Birthday Celebrations: పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? మీరు అసలు ఆ తప్పు చేయకండి

Bad Karma: చెడు కర్మలు తొలగి కోట్లు సంపాదించాలా..? అయితే ఈ దానాలు చేయండి

Devotional Tips:  ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదా..? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే

Chanakya niti: చాణక్య నీతి – ఆ ఐదు లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Big Stories

×