Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అనుపమ ప్రధాన పాత్రలో నటించిన పరదా సినిమా(Parada Movie) ఆగస్టు 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనుపమ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. మీ సినీ కెరియర్ లో మిమ్మల్ని చాలా బాధపెట్టిన రూమర్ ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురయింది.
రంగస్థలం వదులుకున్న అనుపమ?
ఈ ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ తాను సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan)హీరోగా నటించిన రంగస్థలం (Rangasthalam) సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిన వదులుకున్నాను అంటూ ఒక రూమర్ క్రియేట్ చేశారు. అయితే ఇందులో నిజం లేదని, కానీ ఆ రూమర్ కారణంగా నా సినీ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని అనుపమ వెల్లడించారు. రంగస్థలం సినిమాలో ఛాన్స్ వదులుకున్నాననే వార్త సంచలనంగా మారడంతో సుమారు 6 నెలల పాటు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదని తెలిపారు. ఈ సినిమాకు ముందు నేను శతమానం భవతి సినిమాలో నటించాను ఆ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకుంది.
శతమానం భవతి తర్వాత అవకాశాలు లేవు…
శతమానం భవతి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నా గురించి ఇలాంటి వార్తలు రావడం చాలా బాధేసిందని, ఈ రూమర్ కారణంగా ఒక ఏడాది పాటు తాను ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసలు విషయాన్ని వెల్లడించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా అనుకున్నారని అయితే ఇందులో ఎనుములకు స్నానం చేయించే సన్నివేశాలు ఉండటంవల్లే అనుపమ రిజెక్ట్ చేశారంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి. ఈ కారణం చేతనే అనుపమ రిజెక్ట్ చేయడంతో సమంత(Samantha) ఈ సినిమాకు కమిట్ అయి హిట్ కొట్టారని అందరూ భావించారు.
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు..
ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్న తర్వాత సెలబ్రిటీల గురించి ఇలాంటి రూమర్లు ఎన్నో వస్తుంటాయి కానీ ఆ రూమర్లు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని స్పష్టం అవుతుంది. ఇక ఈమె కెరియర్ గురించి మాత్రమే కాదు వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. అనుపమ హీరోతో రిలేషన్ లో ఉన్నారు అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాల గురించి ఈమె పెద్దగా స్పందించకుండా పూర్తిస్థాయిలో కెరియర్ పై ఫోకస్ పెడుతూ… వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అనుపమ కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Anupama Parameswaran: హీరోయిన్ కాకపోతే అనుపమ ఆ పని చేసి ఉండేదా?