E-Paper
Advertisement

Blood Cells : ఇక రక్త దాతల కోసం వెతుక్కునే అవసరం లేదు… ల్యాబ్ లో తయారు చేసిన ఎర్ర రక్త కణాలతో క్లినికల్ ట్రయల్స్

Blood Cells : ఇక రక్త దాతల కోసం వెతుక్కునే అవసరం లేదు… ల్యాబ్ లో తయారు చేసిన ఎర్ర రక్త కణాలతో క్లినికల్ ట్రయల్స్
Advertisement

Blood Cells : తీవ్రమైన గాయాలై రక్తస్రావమైతే… రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సికిల్ సెల్ ఎనీమియా ఉండే వారికి తరచూ రక్తమార్పిడి అవసరం అవుతుంది. రక్త దానం కోసం పదే పదే దాతలను వెతుక్కోవాల్సి వస్తుంది. తగిన బ్లడ్ గ్రూప్ దొరకక ఇబ్బందులు తప్పవు. బ్లడ్ బ్యాంకులకు పరుగెత్తాల్సి రావచ్చు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను అధిగమించే అవకాశం ఉందంటున్నారు లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్టులు. ఎందుకంటే వారు ల్యాబరేటరీలో ఎర్ర రక్త కణాలను పెంచారు. వాటితో ప్రయోగాలు చేపట్టిన శాస్త్రవేత్తలు…ఇద్దరు మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. సాధారణంగా ముందు జంతువులపై ప్రయోగాలు చేసిన తర్వాత మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం పరిపాటి.
దాతల నుంచి సేకరించిన ఎర్రరక్త కణాలు ఎక్కువకాలం ఉంటాయా? ల్యాబరేటరీలో పెంచిన రెడ్ బ్లడ్ సెల్స్ జీవితకాలం ఎక్కువనా అనేది తెలుసుకోడానికి క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. దాతల స్టెమ్ సెల్స్ నుంచి రక్తనాళాల్ని సేకరించి వాటిని ల్యాబరేటరీలో పెంచారు. ఆ తర్వాత వాటిని ఆరోగ్యవంతులైన ఇద్దరు మనుషుల శరీరాల్లోకి ఎక్కించారు. ఈ పరిశోధన సత్ఫలితాలు ఇస్తే… భవిష్యత్తులో తరచూ రక్తం మార్పిడీ చేయాల్సిన వారికి ఇది వరంగా మారనుంది. ఎందుకంటే తక్కువసార్లు రక్తమార్పిడీ చేస్తే సరిపోతుంది అంటారు ఈ పరిశోదనకు నేత్రుత్వం వహించిన సెట్రిక్ గ్రెవెర్డ్ అనే ప్రొఫెసర్. మరోవైపు తరచూ రక్తదాతలను వెతుక్కునే అవసరం కూడా తప్పుతుంది. అంతేకాదు రక్త గ్రహీతలకు ఖర్చు కూడా తగ్గుతుంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×