Japanese Pet Adopt: పెళ్లైన ప్రతి జంట తమకు పిల్లలు కావాలని కోరుకుంటారు. వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కొంత మంది తమకు పిల్లలు లేరని చాలా బాధపడుతుంటారు. అయితే, జపాన్ లో మాత్రం పిల్లలు లేని వాళ్లు ఏమాత్రం బాధపడరు. పిల్లలకు బదులుగా వీధి కుక్కలు, పిల్లులను దత్తత తీసుకుంటారు. జపాన్‌లో చిన్న పిల్లల సంఖ్య కంటే, పెంపుడు జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రజల్లో ఈ ఆలోచన వచ్చింది.
జపాన్ లో దాదాపు 21 మిలియన్ల కుక్కలు, పిల్లులు ఉన్నాయి. అదే సమయంలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కేవలం 14 మిలియన్ల మంది ఉన్నారు. జపాన్ లో చాలా మంది నగరాల్లోని చిన్న ఇళ్లలో నివసిస్తున్నారు. పిల్లలను కని పెంచాలంటే ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకే చాలా మంది పిల్లలకు బదులుగా వీధి కుక్కలను దత్తత తీసుకుంటారు. వీధి కుక్కల కోసం అక్కడ చక్కటి చట్టాలు ఉన్నాయి.
⦿ పెట్స్ యజమానులకు కఠినమైన నియమాలు
ప్రజలు తమ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి జపాన్ కఠిన చట్టాలను చేసింది. అన్ని కుక్కల వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వివరాలు కుక్కలను ట్రాక్ చేయడంలో సాయపడుతుంది. అంతేకాదు, వీధి కుక్కలుగా మారకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కుక్కలకు మైక్రోచిప్ ఉండాలి. కుక్క తప్పిపోతే దానిని గుర్తించడంలో ఈ చిప్ సాయపడుతుంది.
⦿ తక్కువ వీధి కుక్కలు
గతంలో జపాన్ లో వీధి కుక్కలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీధి కుక్కల జనాభాను తగ్గించేందుకు జపాన్ చర్యలు తీసుకుంటుంది.
⦿ కుక్కలకు షెర్టర్లు, దత్తత
జపాన్ లో వీధి కుక్కలను ప్రత్యేక షెర్టర్లు ఉంటాయి. ఈ ఆశ్రయాలు కుక్కలను ఎవరైనా వచ్చి దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తారు.యానిమల్ రెఫ్యూజ్ కాన్సాయ్ (ARK), ఇతర సంస్థలు కుక్కలు దత్తత ఇవ్వడంలో సాయపడుతాయి. 1974లో 1 మిలియన్ కంటే ఎక్కువ కుక్కలను ఆశ్రయాలలో ఉంచారు. జపాన్ కుక్కలను రక్షించడంలో ఈ ఆశ్రమాలు మెరుగ్గా పని చేస్తాయి.
⦿ కుక్కల జనాభాను ఆపడం
జపాన్.. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కల మీద క్రిములు లేకుండా చూసేలా స్ప్రే చేసేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాదు, కుక్కల జనాభాను అదుపు చేసేలా ఆపరేపన్లు కూడా నిర్వహిస్తుంది.
⦿ పెట్స్ యజమానులకు సహాయం చేయడం
జపాన్ పెంపుడు జంతువులను చక్కగా చూసుకునేలా చర్యలు చేపడుతుంది. కుక్కలకు అనుకూలమైన రైళ్లు, టాక్సీలు, కేఫ్‌లు ఉన్నాయి. ఇవి ప్రజలు తమ కుక్కలను స్పేచ్ఛగా వాటిలో తీసుకెళ్లేలా సాయపడుతాయి.
Read Also: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?
ఇక జంతువులను ప్రేమించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం నేర్పడానికి జపాన్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జంతు రక్షణ క్యాచ్ కాపీ పోటీ లాంటి కార్యక్రమాలు పెంపుడు జంతువులను బాగా చూసుకోవాలనే విషయాన్ని వ్యాప్తం చేయడంలో సాయపడుతాయి.
Read Also: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?