Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 75 రోజులుగా నెల్లూరు జైలులో ఆయన ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ ను గోవర్ధన్ కు హైకోర్టు మంజూరు చేసింది. కాకాణి పాస్ పోర్టు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఏడు కేసుల్లో బెయిల్ లభించగా.. తాజాగా అక్రమ మైనింగ్ కేసులోనూ బెయిల్ రావడంతో ఆయనకు ఊరట లభించింది. కాకాణిపై అక్రమ క్వార్ట్జ్ మైనింగ్, ఎమ్మార్వో డిజిటల్ సంతకాల ఫోర్జరీ, ప్రభుత్వ భూ రికార్డుల తారుమారు, అనధికార టోల్‌గేట్ ఏర్పాట్లపై కేసులు నమోదు కాగా.. ఈ కేసుల్లో హైకోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ సమర్పించాలని.. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని హైకోర్టు తెలిపింది. ఈ షరతులు కాకాణి దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా పని చేసిన కాకాణి చాలా అక్రమ పనులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన్ను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ బెయిల్ నిర్ణయం వైసీపీ నాయకులకు ఊరటనిచ్చినప్పటికీ, కూటమి ప్రభుత్వం మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకాణి రాజకీయ భవిష్యత్తు, నెల్లూరు జిల్లా రాజకీయాలపై ఈ బెయిల్ ప్రభావం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: Apprentice Jobs: 750 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ నెలకు రూ.15,000.. ఇదే మంచి అవకాశం