Birthday Celebrations: పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? హంగూ ఆర్బాటాలకు పోయి మీరు అసలు ఆ తప్పు చేయకండి. చేశారో జన్మజన్మల పాపాలు అంటుకుంటాయట. ఇంతకీ పుట్టినరోజు నాడు ఎలా ఉండాలి. ఎలాంటి పనులు చేయకూడదు. ఎలాంటి పనులు చేయాలి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అధునిక నాగరికత మోజులో పడిపోయిన చాలా మంది ఈ మధ్య కాలంలో పుట్టిన రోజు వచ్చిందంటే చాలు పార్టీలు, పబ్బులు, విందులు, వినోదాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. వేలకు వేలు ఖర్చు పెట్టి దావత్‌లు చేస్తుంటారు. ఉన్నోడిని నుంచి లేనోడి వరకు ఎవరి స్థాయిలో వాళ్లు ఫారిన్ కల్చర్‌ను ఎక్స్‌ఫోజ్ చేస్తూ రాత్రంతా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మన సనాతన ధర్మం ప్రకారం పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో..? ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మన సాంప్రదాయం ప్రకారం. పుట్టిన రోజు నాడు బ్రహ్మమూహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. తర్వాత మొదటగా కుల దేవతను స్మరించుకోవాలి. తర్వాత గణపతిని, సూర్య భగవానున్ని ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. వీలైతే వృద్దులకు అనాథలకు అన్నదానం చేయండి. అలాగే ఆ రోజంతా భగవన్నామ స్మరణలో గడపండి.
క్షవరం చేసుకోకూడదు: పుట్టిన రోజు నాడు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ (క్షవరం) చేయించుకోకూడదు. అలా చేయించుకుంటే చెడు కర్మలు వెంటాడతాయట. మీ జీవితంలోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందట.
గోళ్లు తీయకూడదు: జన్మదిన వేళ గోళ్లు తీయడం శాస్త్ర విరుద్దం. గోళ్లు తీసుకోవడం అనేది లక్ష్మీదేవిని దూరం చేసుకోవడమే అంటున్నారు పండితులు.
కలహాలు పెట్టుకోకూడదు: పుట్టిన రోజు నాడు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదట. ఎవరైనా కావాలని మీతో గొడవ పడటానికి వచ్చినా మీరు వారి నుంచి దూరంగా వెళ్లాలట.
ప్రయాణాలు చేయకూడదు: బర్తుడే రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు. అయితే చాలా మంది గుడికి వెళ్లడానికి ప్రయాణం చేస్తుంటారు. అయితే ఆ గుడికి వెళ్లడం అనేది దగ్గరలో గుడికి వెళ్లితే మంచిదని మరీ దూరం వెళ్లే గుడి అయితే ప్రయాణం విరమించుకుని ఇంట్లోనే దేవుణ్ని ప్రార్థించుకోవాలని సూచిస్తున్నారు.
హింసను విడిచిపెట్టాలి: పుట్టిన రోజు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరినీ హింసించకూడదు. చాలా మంది పుట్టినరోజు పార్టీ పేరుతో జంతుబలులు చేస్తుంటారు. అలా చేయకూడదని మీ పుట్టిన రోజు నాడు జంతువులను చంపడం అనేది మీకు చుట్టుకునే పాపకర్మ అంటున్నారు పెద్దలు.
ఇంకా పుట్టినరోజు నాడు జన్మ నక్షత్రం, తిథి ప్రకారం అపమృత్యు పరిహారం కోసం ఆయష్యసూక్తంతో హోమం చేయాలి. దీనివల్ల ఆ మనిషికి దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యాధులు దరిచేరవట. అలాగే పుట్టిన రోజు నాడు అష్ట దిక్పాలకులకు దేవతలకు నమస్కరించుకుంటే మంచిదట. సకల శుభాలు కలుగుతాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు