E-Paper
Advertisement

New Diploma Course:పోలీసులకు ఆ కోర్సు తప్పనిసరి.. దుబాయ్‌లో కొత్త రూల్..

New Diploma Course:పోలీసులకు ఆ కోర్సు తప్పనిసరి.. దుబాయ్‌లో కొత్త రూల్..
Advertisement

New Diploma Course:డిఫెన్స్ విభాగంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. డిఫెన్స్‌కు ఎన్నో పరికరాలు అందించడంతో పాటు అందులో పనిచేసే వారికి కూడా టెక్నాలజీపై ఒక అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. టెక్నాలజీపై ఆఫీసర్లకు మరింత అవగాహన కోసం దుబాయ్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. పోలీసులకు రెండేళ్ల డిప్లోమా కోర్సును అందించనుంది.

డిఫెన్స్‌లో పేలుడు పదార్థాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానికి సంబంధించిన సైన్స్‌నే అప్లైడ్ ఎక్స్‌ప్లోజివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మ్యూనిషన్స్ అంటారు. అయితే డిఫెన్స్‌లో ఉండే అందరికీ ఈ ఎక్స్‌ప్లోజివ్ సైన్స్ విభాగంపై అవగాహన ఉండాలని రెండేళ్ల డిప్లోమా కోర్సును తప్పనిసరి చేశారు దుబాయ్ పోలీస్ జెనరల్ కమాండ్. ఈ కోర్సులో పేలుడు పదార్థాలను ఎలా డీల్ చేయాలి, వాటిని ఎలా కనుక్కోవాలి, ఎలా డిఫ్యూజ్ చేయాలి అనేదానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండనున్నాయి.

Advertisement

దుబాయ్ పోలీసులు ఈ ముందడుగు వేయడం వల్ల డిఫెన్స్‌లో వారు టెక్నాలజీ వినియోగాన్ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకున్నారు, ప్రజల సంరక్షణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అర్థమవుతుంది అని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఈ సైన్స్‌కు సంబంధించి ఇలాంటి ఒక కోర్సును అందించడం ఇదే మొదటిసారి. డిఫెన్స్‌లో అన్ని ఒడిదుడుకులు నేర్చుకోవడానికి, ఎలర్ట్‌గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

పేలుడు పదార్థాల నుండి తప్పించుకోవడంలో, వాటి గురించి అర్థం చేసుకోవడంలో దుబాయ్ పోలీసులు 100 శాతం వృద్ధి సాధించడానికే ఈ కోర్సును ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. పేలుడు పదార్థాల విషయంలో డీల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విభాగమే ఉన్నా కూడా.. ఇతరులకు కూడా వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యమని వారు అన్నారు. ఈ కోర్సుకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందని వారు తెలిపారు.

Advertisement

People and Government:ప్రజలు వర్సెస్ ప్రభుత్వాలు.. ప్రైవసీ విషయంలో..

Key Tests:చంద్రయాన్ 3 అప్డేట్.. టెస్టులు పూర్తి..

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×