E-Paper
Advertisement

Earth Consists: భూమిలోపల మరో కొత్త లేయర్.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Earth Consists: భూమిలోపల మరో కొత్త లేయర్.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..
Advertisement

Earth Consists:చిన్నప్పుడు సైన్స్ పుస్తకంలో చదువుకున్న విషయలే భవిష్యత్తులో కూడా ఎక్కువశాతం గుర్తుండిపోతాయి. భూమి గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి ఆ పుస్తకాల్లో చదువుకున్న విషయాలు ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటాయి. కానీ ప్రపంచం రోజురోజుకీ కొత్తగా మారుతుండడంతో మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలానే మిగిలిపోతుంటాయి. తాజాగా భూమి గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

భూమి లోపల నాలుగు లేయర్లు ఉంటాయి. ఇదే మనం చిన్నప్పుడు నేర్చుకున్న విషయం. కానీ అసలైతే.. అవి నాలుగు కాదు అయిదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో భూమిలోని ఇన్నర్ కోర్‌లో కూడా ఒక లేయర్ ఉందని తేలింది. చిన్నప్పటి ఫిజిక్స్ పుస్తకాల్లో భూమికి నాలుగు లేయర్లు ఉంటాయని.. అవే క్రస్ట్, మ్యాంటిల్, లిక్విడ్ ఔటర్ కోర్, సాలిడ్ ఇన్నర్ కోర్ అని చదువుకున్నాం. ఇప్పుడు కొత్త లేయర్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టడంతో దీని గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.

Advertisement

భూమి ఇన్నర్ కోర్‌లో పరిశోధనలు చేయడం కష్టమైనా.. పెరుగుతున్న టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఇక ఈరోజుల్లో భూకంపాలు అనేవి ప్రమాదకరంగా మారాయి. దీనికోసమే మరోసారి భూమి ఇన్నర్ కోర్‌ను స్టడీ చేయాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. భూమిలోపల భాగం నుండి సీస్మిక్ వేవ్స్ అనేవి మరో లేయర్ గురించి తెలుసుకోవడానికి వారికి సహాయపడ్డాయి.

శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త లేయర్.. ఐరన్, నికెల్ సమూహమని వారు గుర్తించారు. దాదాపు ఇతర లేయర్స్ కూడా వీటితోనే నిండి ఉంటాయి. కానీ ఈ లేయర్స్‌కు, దానికి ఒక తేడా ఉంది. భూకంపం వచ్చినప్పుడు ఎంత వేగంతో భూమిని తాకాలని నిర్ణయించేది ఈ లేయరే అని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 20 ఏళ్ల క్రితమే ఇన్నర్ కోర్‌ లోపల ఉండే ఒక మెటాలిక్ బాల్‌ను వారు గుర్తించారు. ఇప్పుడు ఈ లేయర్‌ను నిరూపించడానికి ఒక కచ్చితమైన ఆధారాన్ని గుర్తించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Mystery :మిస్టరీ పెయింటింగ్ వివరాలు కనిపెట్టిన ఏఐ..

Covid Vaccine:గుండె సంబంధిత వ్యాధులపై కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్..

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×