EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఏపీఎఫ్‌సీ పోస్టుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 577 ఖాళీ పోస్టులున్నాయి. అందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 418 , అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు 159 ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య : 577
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ
వయసు : ఈవో/ ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్‌సీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది)
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 17-03-2023
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/