Big Stories

Sheethala Devi Pooja:శీతల దేవతకు ఎలాంటి పూజ చేయాలి…?

Sheethala Devi Pooja:హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒకటో శీతల సప్తమి ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో సప్తమి రోజున, రెండోది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. ఏటా హోలీ తర్వాత ఏడో రోజు నాడు శీతల సప్తమి జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ మార్చి 8వ తేదీన వస్తోంది. హోలీ తర్వాత ఏడో రోజు శీతల సప్తమి జరుపుకుంటా. అంటే మార్చి 14న శీతల సప్తమి వస్తోంది.

- Advertisement -

ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అనంతరం వంటగదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం శీతల మాతను ఆరాధించడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ఉపవాసం ఉండాలి. ఈరోజున రాత్రంతా జాగారం చేసి అమ్మవారి పూజనలు, భజనలు చేస్తారు.

- Advertisement -

శీతల దేవి ఆరాధనతో మశూచి, కలరా, తట్టు, వ్యాధులు రావని భక్తుల నమ్మకం. శీతల దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోని కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.శీతల సప్తమి రోజున ముందు రోజు వండిన ఆహారాన్ని శీతల దేవికి నైవేద్యంగా పెడతారు. శీతల సప్తమి రోజు ఇంట్లో పొయ్యి వెలిగించరు. ఎలాంటి వంటకాలు చేయరు. ముందు రోజు వండి పెట్టుకున్న ఆహారాన్ని ఈ రోజున తింటారు. శీతల అమ్మావారి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శీతల సప్తమి రోజుల్లో శీతల దేవిని పూజిస్తారు.

శీతల సప్తమితో వేసవికాలం ప్రారంభమవుతుందని పండితులు చెబుతారు. శీతల దేవికి చల్లని పదార్థాలు చాలా ఇష్టమని, అందుకే భక్తులందరూ సప్తమి రోజున తయారు చేసిన ఆహారాన్ని అష్టమి రోజున ప్రసాదంగా తీసుకోవాలని నమ్ముతారు

Salakatla Teppotsavam:సాలకట్ల తెప్పోత్సవాల మహిమ

Brahmotsavam:మంగళగిరిలో బ్రహ్మోత్సవం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News