Big Stories

Fasting : ఉపవాసాలు దైవప్రియమా..?

Fasting : ఉపవాసం మన శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దేవుడ్ని ప్రేమించటం ఎంత మంచిదో..మన శరీరాన్ని కూడా ప్రేమించటం అంతే ముఖ్యం. నీకు సక్రమించే పాపాలకు నీకు లభించే పుణ్యాలకు శరీరానికి ఏ సంబంధమూ ఉండదు. పాపాలు, పుణ్యాలు చేసేది మన మనస్సు. శరీరం కాదు.

- Advertisement -

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? అందరూ ఉపవాసం చేయాలా లేక ఏదైనా ప్రత్యేకమైన రోజున చేయాలా ఇది తెలుసుకునే ముందు ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

- Advertisement -

మన శరీర వ్యవస్థలో ప్రతీమండానికి మార్పులు వస్తాయి. మండలం అంటే 40 నుండి 48 రోజుల కాల వృత్తం. ఈ కాల వృత్తంలో మీకు 3 రోజుల పాటు ఆహారం అవసరం లేదు. మీకు మీ శరీరం ఎలా పనిచేస్తోందో అనే స్పృహ ఉంటే, మీకు ఫలానా రోజున భోజనం అక్కరలేదన్న సంగతి తెలుస్తుంది.

మీరు ఆ రోజునా ఏ శ్రమ లేకుండానే, భోజనం చేయకుండా గడపగలరు. చివరకి కుక్కలకీ, పిల్లులకీ కూడా ఈ అవగాహన ఉంది. ఒకరోజు అవి అసలు ఆహారం ముట్టుకోవు. ఏ రోజైతే వ్యవస్థ ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తుందో, ఆ రోజు శరీరం తనిని తాను శుద్ధి చేసుకునే రోజు. చాలామందికి ఏ రోజు భోజనం చేయకుండా ఉండాలో తెలీదు గనుక, భారతీయ పంచాంగంలో, ఆ రోజును ఏకాదశిగా గుర్తించారు – ఏకాదశి చాంద్రమానంలో 11వ రోజు. అది ప్రతి 14రోజులకీ పునరావృతమౌతుంది. అది సంప్రదాయంగా ఉపవాసం చేసే రోజు.

మీ మనసునీ, శరీరాన్నీ ముందుగా ఉపవాసానికి తగిన విధంగా సిద్ధం చేయకుండా బలవంతంగా ఉపవాసం చేస్తే, లాభానికి బదులు మీ ఆరోగ్యానికి హాని చేసుకుంటారు. మీ శరీరమూ, మనసూ, శక్తీ, ఆ సాధనకి తగినట్లుగా తయారుగా ఉంటే, మీకు ఉపవాసం వల్ల లాభం చేకూరుతుంది. తరచు పొగతాగేవారికీ, కాఫీ తాగేవారికీ, ఉపవాసం చేయడం చాలా కష్టం అనిపించవచ్చు. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పళ్ళూ, కూరగాయలూ తినడం ద్వారా. అందరికీ ఉపవాసం చేయడం మంచిది కాకపోవచ్చు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దానివల్ల ఎన్నో లాభాలున్నాయి ప్రశాంత సమయంలో ఉపావాసాలు చేయాలి. .

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News