Skipping : వ్యాయామం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే అందరూ వర్కవుట్స్ చేయలేరు. అలాగని వర్కవుట్స్ చేయకుంటే స్థూలకాయంతో పాటు అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కనీసం ప్రతి రోజూ చిన్న వ్యాయామాలు చేయాలంటున్నారు నిపుణులు. అలాంటి వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. కొందరు జిమ్‌లకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఆ సమయం కూడా లేక కొందరు అవి కూడా స్కిప్ చేస్తుంటారు. అయితే అలాంటి వారు స్కిప్పింగ్‌ను చేయొచ్చు. జిమ్‌లలో చేసే వర్కవుట్స్‌లో చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో. కేవలం స్కిప్పింగ్‌తో కూడా అన్నే ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎన్నో రోగాలను స్కిప్పింగ్ నయం చేస్తుంది. స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా సహాయపడుతుంది. శరీరంలో అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్‌తో నిమిషానికి 15 నుంచి 20 కేలరీలను బర్న్ చేయవచ్చు. అంతేకాకుండా స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్‌తో హార్ట్ బీట్ రేటు పెరుగుతుంది. గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్కిప్పింగ్ మెదడుపై కూడా అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్పిప్పింగ్ చేసే మొదట్లో మన శరీరం బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడంతో శరీరం హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాకుండా మిమ్మల్ని రీఫ్రెష్‌గా ఉంచుతుంది. అందుకు బద్దకం, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు ప్రతిరోజు స్కిప్పింగ్ చేయాలి. ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనలాంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వీటి నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తూ ఉత్సాహంగా ఉండండి.