South Movie : ప్రధాని నరేంద్ర మోడీ తన పనులతో బిజీగా ఉంటారు. అంత బిజీ షెడ్యూల్లోనూ ఆయన ఓ సినిమాను చూడటానికి ఆసక్తిగా ఉన్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మోడీని అంతలా ఆకట్టుకున్న చిత్రం ఏదో తెలుసా!.. దక్షిణాది సంస్కృతులను గురించి ఎలివేట్ చేస్తూ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ.200 కోట్లకు చేరువలో ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పుడీ కాంతార చిత్రాన్ని మోడీ చూడాలనుకుంటున్నారు. నవంబర్ 14న మోడీ సినిమాను చూడబోతున్నట్లు సమాచారం. దీని కోసం పి.ఎం.ఒ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. కర్ణాటకలో తుళు నాడులోని కల్చర్ భూత కోలాను కాంతారలో చూపించారు. ఈ సినిమా తర్వాత భూత కోలా చెప్పే వ్యక్తులకు పెన్షన్ ఇవ్వబోతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రీసెంట్‌గా ఈ సినిమాలో వరాహ రూపం.. అనే సాంగ్‌పై వివాదం నెలకొంది. ఈ కాంట్రవర్సీపై ఇంకా కాంతార టీమ్.. ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రధాన మోడీతో పాటు హీరో రిషబ్ శెట్టి కూడా ఈ సినిమాను వీక్షించబోతున్నారు.