E-Paper
Advertisement

Gaganyaan : గగన్‌యాన్‌పై పలు టెస్టులు పూర్తి.. అన్నీ సక్సెస్..!

Gaganyaan : గగన్‌యాన్‌పై పలు టెస్టులు పూర్తి.. అన్నీ సక్సెస్..!
Advertisement
Gaganyaan

Gaganyaan : ఒక దేశం చేసిన స్పేస్ పరిశోధనలు చూసి ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈ విభాగంలో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ దేశం కూడా ఈ విభాగంలో వెనక్కి తగ్గడం లేదు. అందులో ఇండియా కూడా ఒకటి. ఇప్పటికే ఇండియాకు సంబంధించిన స్పేస్ సంస్థ ఇస్రో.. ఎన్నో కొత్త ప్రయోగాలతో సిద్ధం ఉంది. తాజాగా తమ తరువాతి పరిశోధన కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన టెస్ట్ సక్సెస్ అవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న సంవత్సరాల్లో ఎలాంటి పరిశోధనలు చేయాలని, ఎలాంటి మిషిన్స్‌ను గగనతలంలోకి పంపాలి అన్న విషయంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పూర్తి ప్లానింగ్‌తో ఉంది. ఇప్పటికే చంద్రయాన్ లాంటి శాటిలైట్ల తయారీ వేగంగా జరుగుతున్న క్రమంలో మరోవైపు గగన్‌యాన్‌పై కూడా ఇస్రో ఫోకస్ పెట్టింది. తాజాగా గగన్‌యాన్‌లోని హ్యామన్ స్పైస్ ఫ్లైట్ మిషిన్‌లోని పారాషూట్స్‌పై టెస్టులను పూర్తిచేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.

Advertisement

గగన్‌యాన్ పైలెట్‌కు సంబంధించి రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ డిప్లాయ్‌మెంట్ టెస్టును ఇస్రో శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు. దీంతో పాటు అపెక్స్ కవర్ సెపరేషన్ (ఏసీఎస్) పారాషూట్స్ టెస్టును కూడా ఇస్రో సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసింది. ముందు జరిగిన టెస్టులో రెండు పైలెట్ పారాషూట్స్‌ను టెస్ట్ చేయడం జరిగిందని, ఈ రెండు వేరే యాంగిల్స్‌ను కవర్ చేయడానికి ఉపయోగపడనున్నాయని ఇస్రో హెడ్‌క్వార్టర్స్ ప్రకటించింది.

ఇక గగన్‌యాన్‌పై జరిగిన రెండో టెస్ట్ విషయానికొస్తే.. రెండు ఏసీఎస్ పారాషూట్స్ యొక్క క్లస్టర్డ్ డిప్లాయ్‌మెంట్ ఏ ప్రెజర్ పరిస్థితుల్లో పనిచేస్తుందని పరీక్షించారు. ఈ రెండు టెస్టులు పైరోటెక్నిక్ మొర్టర్ డివైజ్ ద్వారా టెస్ట్ చేయబడ్డాయని ఇస్రో తెలిపింది. గగన్‌యాన్‌కు సంబంధించిన పారాషూట్ డిప్లాయ్‌మెంట్ ప్రక్రియకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌తో పాటు ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కలిసి సహకరిస్తున్నాయని ఇస్రో బయటపెట్టింది.

Advertisement

గగన్‌యాన్ అనేది ఒక హ్యూమన్ స్పైస్ ఫ్లైట్‌గా అంతరిక్షంలోకి లాంచ్ అవ్వనుంది. ఇందులో ముగ్గురు ఆస్ట్రానాట్స్ స్పేస్‌కు ప్రయాణమవ్వనున్నారు. గగన్‌యాన్ మూడు రోజుల పాటు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణాలు చేసి క్రూను తిరిగి భూమిపైకి క్షేమంగా చేర్చనుంది. 2024 చివర్లో గగన్‌యాన్ లాంచ్‌కు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. దీనికంటే ముందు మరో రెండు మిషిన్లు ఇస్రో తరపున అంతరిక్షానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×