BigTV English

Raashi Khanna: బాహుబ‌లి ఛాన్స్ వ‌దులుకున్న రాశీఖ‌న్నా.. అస‌లు విష‌యం చెప్పిన బ్యూటీ

Raashi Khanna: బాహుబ‌లి ఛాన్స్ వ‌దులుకున్న రాశీఖ‌న్నా.. అస‌లు విష‌యం చెప్పిన బ్యూటీ
Raashi Khanna

Raashi Khanna : చ‌బ్బీ బ్యూటీ రాశీ ఖన్నా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఓ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ అయ్యో అని అన‌నుకుంటున్నారు. అందుకు కార‌ణం.. ఆమె పాన్ ఇండియా మూవీలో ఆఫ‌ర్ పోగొట్టుకోవ‌ట‌మే. ఇంత‌కీ రాశీఖ‌న్నా చాన్స్ పోగొట్టుకున్న పాన్ ఇండియా మూవీ ఏదో కాదు.. బాహుబ‌లి. ఏంటి నిజ‌మా! అనే సందేహం రాక మాన‌దు. కానీ ఇదే అస‌లు విష‌యం. అది కూడా రాశీ ఖ‌న్నా చెప్ప‌టంతో న‌మ్మ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇంత‌కీ రాశీ ఖ‌న్నా ఎందుక‌ని బాహుబ‌లి మూవీలో ఛాన్స్ పోగొట్టుకుంద‌నే వివ‌రాల్లోకి వెళితే,


రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ ‘‘నిజానికి నేను బాహుబలి చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగు పెట్టాల్సింది. ఆడిష‌న్‌లో కూడా పాల్గొన్నాను. బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా పాత్ర‌కు ఆడిష‌న్ చేస్తున్నార‌ని తెలిసింది. అప్ప‌టికే మ‌ద్రాస్ కేఫ్ సినిమాలో న‌టించాను. నాకు బాహుబ‌లి ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఆడిష‌న్‌కు వ‌చ్చాను. అయితే రాజ‌మౌళిగారు నన్ను చూడ‌గానే చాలా క్యూట్‌గా ఉన్నావు. నీకు బాహుబ‌లిలో అవంతిక పాత్ర కంటే.. ల‌వ్ స్టోరి అయితే బావుంటుంద‌ని అన్నారు. ఆయ‌న వెంట‌నే ఆయన ల‌వ్ స్టోరి నిర్మిస్తోన్న ఆయ‌న స్నేహితుడు ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లారు. ఆ సినిమాయే ఊహ‌లు గుస‌గుస‌లాడే. అలా బాహుబ‌లిలో చాన్స్ పోయింది. అయితే నా తొలి సినిమా ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమా ఇక్క‌డ మంచి విజ‌యాన్నిసాధించింది. వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి’’ అన్నారు.

మ‌రి రాజ‌మౌళిని ఆయ‌న సినిమాలో వేషం ఇవ్వ‌మ‌ని ఎప్పుడూ అడ‌గ‌లేదా? అని అడిగితే ఆయ‌న్ని క‌లిసిన‌ప్పుడంతా ఆయ‌న‌కు గుర్తు చేస్తుంటాను. ఆయ‌న త‌ప్ప‌కుండా అని న‌వ్వేస్తుంటారు అని స‌మాధానం చెప్పింది రాశీఖ‌న్నా. హిందీ, తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు డిజిట‌ల్ మాధ్య‌మంలోనూ రాశీఖన్నా న‌టిగా రాణిస్తోంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×