E-Paper
Advertisement

Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!
Advertisement

Guava:ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట.. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య మంచి సత్కారాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది.

శ్రీ గణపతికి జామపండును నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన గ్యాస్ట్రిక్, ఉదర వ్యాధులు దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దేవీ దేవాలయానికి జామకాయను నైవేద్యంగా పెట్టి, వాటిని సుమంగళులకు పంచితే షుగర్ సమస్యలు తగ్గిపోతాయి. పెళ్లికాని అమ్మాయిల చేతులమీదుగా జామపండులతో పూజ చేయించి, సుమంగుళులకు తాంబూలాలు ఇస్తే.. మంచి వరుడు లభిస్తాడు. గౌరీ పూజకు నైవేద్యంగా వుంచిన జామపండును తినడం వల్ల మనసులో వున్న మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా వుంటారు. కోరిక కోరికలు కూడా నెరవేరుతాయి.

Advertisement

ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామపండ్లు వేస్తే చక్కెర వ్యాధి దీర్ఘకాలం నుంచి నయం కాని వ్యాధులు తొలగిపోతాయి. రుద్రాభిషేకం సమయంలో జామపండు, కమలాపండు రసాలతో దేవునికి అభిషేకం చేసి, ఇతరులకు జామపళ్లను దానం చేస్తే.. నిదానంగా జరిగే పనులు త్వరితంగా పూర్వవుతాయి. గణపతి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయించి, తాంబూలంతోపాటు జామపళ్లను సంకల్పసమేతంగా ప్రార్థన చేస్తే ఆదాయంలో అధికంగా లాభం కలుగుతుంది, సిరిసంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.

దుర్గాదేవీకి దీపనమస్కారాలు చేసే సమయంలో జామపళ్లను నైవేద్యం పెట్టి సంతానం లేనివారికి ఇస్తే.. అనుకున్న కోరిక నెరవేరుతుంది. శ్రీలక్ష్మీనారాయణుడికి నైవేద్యంగా పెట్టిన జామపళ్లను కొత్త దంపతులకు తినడానికి ఇస్తే.. వారిమధ్య కలహాలు వుండకుండా, సంతోష జీవనాన్ని కొనసాగిస్తారు. సంకష్ట హర గణపతికి జామపళ్లను నైవేద్యంగా పెట్టి, బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి ఇస్తే.. దేహంలో వుండే నీరసం తగ్గిపోయి… ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా ఉంటారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×