BigTV English

Kia Car :ఇకపై ఆ కియా కారు ఇండియన్ మార్కెట్‌లో బంద్..

Kia Car :ఇకపై ఆ కియా కారు ఇండియన్ మార్కెట్‌లో బంద్..


Kia Car : మార్కెట్లోని పోటీని బట్టి ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో ముందుకు రావాల్సి ఉంటుంది. అలాంటి మార్పులు కొందరు కస్టమర్లకు నచ్చకపోయినా.. సంస్థకు మాత్రం మంచి జరుగుతుందని యాజమాన్యం నమ్ముతుంది. వివిధ దేశాల్లోని మార్కెట్స్‌ను బట్టి సంస్థల నిర్ణయాల్లో మార్పులు జరుగుతుంటాయి. తాజాగా ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కార్ల కంపెనీ కియా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ కియా.. కార్నివల్ ఎమ్పీవీ కార్ మోడల్ తయారీని ఇండియన్ మార్కెట్ నుండి తొలగించాలని నిర్ణయించుకుంది. ఇండియాలోని అధికారిక కియా వెబ్‌సైట్‌లో ప్రీమియం ఎమ్పీవీకి సంబంధించిన మోడల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తొలగించింది. ఇంతకు ముందు ఇండియాలో కియా మోడల్స్‌లో లాంచ్ అయిన కార్నివల్ మోడల్ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉండేది. కానీ తాజాగా వచ్చిన కార్నివల్ మోడల్ నుండి బీఎస్6 ఫేజ్ 2 అప్డేట్ అనేది ఏమీ రాలేదు.


అప్డేట్ రాకపోవడంతో అప్పుడే కస్టమర్లకు ఈ మోడల్ ప్రొడక్షన్ గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు కార్నివల్ ప్రొడక్షన్ ఆగిపోయినా కూడా మళ్లీ వచ్చే ఏడాది తప్పకుండా ఇండియన్ మార్కెట్లోకి ఈ మోడల్ అడుగుపెడుతుంది అని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రీమియం ఎమ్పీవీ మోడల్ మరింత అడ్వాన్స్‌డ్ రూపంలో కస్టమర్ల ముందుకు వస్తుందని భావిస్తున్నారు. కార్నివల్ మోడల్‌ను కేఏ4 మోడల్‌తో రీప్లేస్ చేసే ఆలోచనలో కియా ఉన్నట్టు కొన్ని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×