Trolls on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ప్రీమియర్స్ వల్ల 25న రిలీజ్ కావాల్సిన మూవీ 24వ తేదీ రాత్రే థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. ఈ సినిమాపై చాలా రోజుల నుంచి భారీ హైప్ ఉంది. నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాదు, పలువురు హీరోలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ప్రీమియర్స్ టికెట్లు ఒక్కో చోట రూ. 2000 నుంచి రూ. 5000 వరకు పలుకుతుంది.
అయితే ఈ టైంలో ఈ సినిమాపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పవర్ స్టార్ కావొచ్చు. కానీ, ఇప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. అలాగే ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి. అన్నింటికీ మించి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. కాబట్టి ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం చాలా కామన్. ఇప్పుడు అదే జరుగుతుంది.బయట అంతా ఓజీ ఫీవర్ నడుస్తున్న టైంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు… పవన్ కళ్యాణ్‌ను ఆయన సినిమాను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఓజీ అంటే ఒరిజనల్ గ్యాంగ్ స్టార్, ఓజస్ గంభీర కాదు… ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ టైంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఒంటరిగా పోటీ చేసిన్పపుడు ఓడిపోయాడు. పొత్తు పెట్టుకుంటేనే గెలిచాడు. పవన్ కళ్యాణ్ నిజమైన ఓజీ. ఒంటరిగా గెలవలేనివాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు… రెండు కలిపి చూడొద్దు అంటూ రిప్లే ఇస్తున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొవాలని.. ఇలా సినిమాపై ట్రోల్స్ చేయడం సరికాదు అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఓజీ సినిమా ప్రీమియర్స్‌కి అన్నీ రెడీ అయిపోయాయి. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ప్రీమియర్స్ షోలతోనే ఇప్పటి వరకు సినిమాకు దాదాపు 40 నుంచి 50 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, ఓజీ ఓపెనింగ్ కలెక్షన్లు 100 కోట్లు ఈజీగా దాటేయొచ్చు అంటూ ట్రేడ్ పండితులు కూడా అంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు ఏవీ కూడా రూ. 100 కోట్ల మైలు రాయి అందుకోలేదు. ఇప్పుడు ఓజీ మూవీ మొదటి రోజే 100 కోట్లు క్రాస్ అయ్యే సూచనలు ఉన్నాయి.