SL Vs PAK : ఆసియా కప్ 2025లో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 134 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 138 పరుగులు చేసింది. దీంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. టీమిండియాతో ఆడినట్టుగానే ఫకర్ జమాన్, ఫర్హాన్ ఓపెనర్లుగా బరిలోకి వచ్చారు. ఇద్దరూ అద్భుతంగా స్ట్రైక్ రొటేషన్ చేశారు. తొలి 5 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 43 పరుగులు చేసింది. 5.3 ఓవర్ల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫర్హాన్ తీక్ణణ బౌలింగ్ లో కమింద్ మెండీస్ క్యాచ్ అందుకున్నాడు. పాకిస్తాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
Also Read : IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్
ఇక వెను వెంటనే 5.5 ఓవర్లలో తీక్షణ బౌలింగ్ లో హసరంగా క్యాచ్ ని అందుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు పుంజుకున్నట్టు కనిపించింది. 6.4 ఓవర్ లో హసరంగ అయూబ్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు సంబురాలు జరుపుకున్నారు. ఇక మరోవైపు 8.1 ఓవర్ లో హసరంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో పాకిస్తాన్ జట్టు 4 వికెట్లను కోల్పోయింది. మరోవైపు మహ్మద్ హారీస్ ని చమీర క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఏ మాత్రం తడబడకుండా విజయం వైపు దూసుకెళ్లింది. ఒక దశలో వికెట్ పడిందని శ్రీలంక బౌలర్లు అప్పీల్ చేశారు. హుస్సెన్ తలాత్ (33).. మహ్మద్ నవాజ్ (38) చివర్లో కాస్త రెచ్చిపోవడంతో పాకిస్తాన్ విజయతీరాలకు చేరుకుంది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 134 పరుగులు చేసింది.
Also Read : IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో
శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిశాంక 8, కుశాల్ మెండిస్ 0, విఫలం చెందారు. శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా 15, అసలంక 20, శనక 0 పరుగులు చేశారు. ముఖ్యంగా శ్రీలంక కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, శనక డకౌట్ కావడంతో శ్రీలంక భారీ స్కోర్ చేయలేకపోయింది. హసరంగ 15, కరుణ రత్నే17 పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 2, తలత్ 2, హారిస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ 1 చొప్పున వికెట్లు తీశారు. షాహీన్ అఫ్రిది రెండు స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కి గొప్ప ఆరంభాన్ని అందించాడు. హారీస్ రవూఫ్.. కుశాల్ పెరీరా వికెట్ పడగొట్టగా. హుస్సెన్ తలత్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి శ్రీలంకను కోల్కోలేని దెబ్బతీశాడు. కమిందు మెండిస్ హాఫ్ సెంచరీ చేయడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది. లేదంటే శ్రీలంక మరింత కష్టాల్లో కూరుకుపోయి ఉండేది. అయినప్పటికీ చివరికీ పాకిస్తాన్ జట్టే విజయం సాధించింది.