SL Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిశాంక 8, కుశాల్ మెండిస్ 0, విఫలం చెందారు. శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా 15, అసలంక 20, శనక 0 పరుగులు చేశారు. ముఖ్యంగా శ్రీలంక కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, శనక డకౌట్ కావడంతో శ్రీలంక భారీ స్కోర్ చేయలేకపోయింది. హసరంగ 15, కరుణ రత్నే17 పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 2, తలత్ 2, హారిస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ 1 చొప్పున వికెట్లు తీశారు.
Also Read : SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?
ముఖ్యంగా షాహీన్ అఫ్రిది రెండు స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కి గొప్ప ఆరంభాన్ని అందించాడు. హారీస్ రవూఫ్.. కుశాల్ పెరీరా వికెట్ పడగొట్టగా. హుస్సెన్ తలత్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి శ్రీలంకను కోల్కోలేని దెబ్బతీశాడు. కమిందు మెండిస్ హాఫ్ సెంచరీ చేయడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది. లేదంటే 100 లోపే ఆలౌట్ అయ్యేది. కీలక బ్యాటర్లు అందరూ త్వరగా ఔట్ అయ్యారు. దీంతో ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ టార్గెట్ 135 పరుగులు. పాకిస్తాన్ అలవొకగా టార్గెట్ ను ఛేదించేలా కనిపిస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్ ఓడిపోతుందని అంతా భావించారు.
Also Read : IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
కానీ పాకిస్తాన్ బౌలర్లు పుంజుకొని శ్రీలంకను దెబ్బతీశారు. దీంతో పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో విజయం వైపు అడుగులు వేయనుంది. పాకిస్తాన్ శ్రీలంకపై విజయం సాధిస్తే.. ఈనెల 25న బంగ్లాదేశ్ తో తలపడనుంది. బంగ్లాదేశ్ రేపు టీమిండియాతో తలపడనుంది. బంగ్లాదేశ్ తో భారత్ విజయం సాధిస్తే.. పాక్ కి బంగ్లా కి జరిగే మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే.. బంగ్లా.. పాకిస్తాన్ గెలిస్తే.. పాకిస్తాన్ టీమిండియాతో ఫైనల్ కి రానుంది. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టే ఫైనల్ కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ మ్యాచ్ కూడా సండే రోజే జరగడం విశేషం. ముచ్చటగా మూడో సండే రోజు పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ ఉండనుంది. ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.