పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం సరైంది కాదని.. ఫకర్ జమాన్ ఔట్ కాకుండా ఉంటే కచ్చితంగా పాకిస్తాన్ విజయంసాధించేది అని తెలిపాడు. మరోవైపు అంపైర్ నాటౌట్ ప్రకటించి ఉండాల్సింది అని అంపైర్ పై తన అక్కసుని వెల్లగక్కాడు. తాజాగా టీమిండియా కీలక ఆటగాడు కే.ఎల్. రాహుల్ గురించి షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. అసలు టీమిండియాలో కే.ఎల్. రాహుల్ ఎందుకు లేడో అర్థం కాలేదు. కే.ఎల్. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ జట్టు ఇంకా చిత్తు చిత్తుగా ఓడిపోయేది అని చెప్పుకొచ్చాడు అక్తర్. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్
మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్ల పై రెచ్చిపోవడం.. టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు కౌంటర్లు ఇవ్వడం జరుగుతూనే ఉంది. కేవలం ఆటగాళ్లే కాదు.. అభిమానుల మధ్య కూడా యుద్దం జరుగుతోంది. మొన్న సూపర్ 4 మ్యాచ్ లో పలువురు టీమిండియా-పాకిస్తాన్ అభిమానులు దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగానే కొట్టుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ లేడీ టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కి స్టేడియం లోనే ప్రపోజ్ చేసింది. దీంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆసియా కప్ 2025లో క్రికెట్ లో హైలెట్స్ ఏమైనా ఉన్నాయంటే.. అది టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో జరిగిన సంఘటనలు అనే చెప్పవచ్చు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ వివాదం సృష్టించిన విషయం విధితమే. మరోవైపు సూపర్ 4 పలువురు ఆటగాళ్లు ఇండియా పై యుద్ధ విమానాలు, ఆపరేషన్ సింధూర్ సంఘటనలు గుర్తు చేశారు. అందుకు టీమిండియా అభిమానులు సైతం వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
Shoaib Akhtar Said :
India would've won earlier if KL Rahul played in middle in place of Samson. pic.twitter.com/CykCIJwxuH— HXF (@Swisstx1) September 23, 2025