Group-II Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పలువురు గ్రూప్-2 రాసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది నిరుద్యోగులు కలిసి హైకోర్టును కూడా ఆశ్రయించారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఎదురుగా ఇరువర్గాల వాదనలు ఈ రోజు సాయంత్రం ముగియగా.. కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు తదుపరి కార్యచరణ నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!