Kondapur News: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కొండాపూర్ మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ లో బౌన్సర్లను కస్టమర్లు చితకబాదారు. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతోంది. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి జరిగిన గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
?utm_source=ig_web_copy_link
మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ రెస్టారెంట్ కి శనివారం రాత్రి సమయంలో కొంత మంది కస్టమర్లు వచ్చారు. బిల్లు చెల్లించాలని కస్టమర్ల ను మేనేజర్ అడగడం తో గొడవ స్టార్ట్ అయ్యింది. దీంతో బౌన్సర్లు గొడవలో జోక్యం చేసుకున్నారు. కస్టమర్లలకు బౌన్సర్ల మధ్య పరస్పర వాగ్వాద తో కస్టమర్లు గొడవకు దిగారు. ముగ్గురు బౌన్సర్లపై కస్టమర్లు దాడి చేశారు. దీంతో బౌన్సర్లకు తీవ్ర గాయాలు అయ్యారు. రక్తపు మడుగులలో బౌన్సర్లు గాయాలతో పడిపోయారు. గాయాల పాలైన బోన్సర్లను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.