E-Paper
Advertisement

Xiaomi Car  : టెస్లాకు పోటీగా జియోమీ కారు.. లాంచ్ ఎప్పుడంటే..?

Xiaomi Car  : టెస్లాకు పోటీగా జియోమీ కారు.. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement
Xiaomi Car

Xiaomi Car : ఆటోమొబైల్ రంగానికి పెరుగుతున్న క్రేజ్ చూసి.. ఎన్నో ఇతర బిజినెస్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాలని తొందర పడుతున్నాయి. ముఖ్యంగా గ్యాడ్జెట్స్ కంపెనీలు అయితే ఒకటి తర్వాత ఒకటిగా ఆటోమొబైల్ రంగం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్ లాంటి సంస్థ.. అల్ట్రా మోడర్న్ కార్లను తయారు చేయనుందంటూ వార్తలు వినిపిస్తుండగా.. మరో స్మార్ట్ ఫోన్ సంస్థ జియోమీ కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యింది.

Advertisement

2021 మార్చిలోనే జియోమీ.. ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో పలు రూమర్స్ బయటికొచ్చాయి. అందులో చాలావరకు కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఇక మొదటి జియోమీ కార్ లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినే టైమ్ వచ్చేసినట్టు సమాచారం. చైనాకు చెందిన ఫ్యూవీ ఆటోమొటీవ్ పార్ట్స్ కో (ఫా) అనే సప్లయిర్ సంస్థ.. జియోమీ కారు గురించి ఒక సమాచారాన్ని బయటపెట్టింది.

వచ్చే ఏడాది వరకు జియోమీ కార్ లాంచ్ కానుందని, దీనికి ధర కూడా ఫైనల్ అయ్యిందని ఫా తెలిపింది. ధర ఫైనల్ అయినా కూడా ఇప్పటికీ దీని గురించి కచ్చితమైన సమాచారం అందలేదని చెప్పింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం జియోమీ కార్ స్టార్టింగ్ ప్రైజ్ 20,777 డాలర్లు ఉండవచ్చని అంచనా. ధర గురించి రూమర్స్ బయటికి రావడంతో అప్పుడే దీనిని టెస్లా లాంటి బ్రాండ్స్‌తో పోలుస్తున్నారు. ప్రస్తుతం టెస్లా మోడల్ 3 ధర మార్కెట్లో 35000 డాలర్లు ఉంది. దీంతో పోలిస్తే జియోమీ.. కస్టమర్లకు మరింత అందుబాటులో ఉండే ధరతోనే లాంచ్ కానుందని భావిస్తున్నారు.

Advertisement

జియోమీ యాజమాన్యం మాత్రం కారు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని హెచ్చరించింది. అంతే కాకుండా వైరల్ అవుతున్న ధర కూడా నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. జనవరి నుండి జియోమీ కారుపై టెస్ట్ రన్ జరుగుతుండగా.. కచ్చితంగా వచ్చే ఏడాదిలోనే ఇది మార్కెట్లో విడుదల కానుందని కస్టమర్లు భావిస్తున్నారు. ధర విషయంలో చాకచక్యంగా నిర్ణయం తీసుకుంటే జియోమీ ఎలక్ట్రిక్ కారు.. కచ్చితంగా టెస్లాకు పోటీ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×