E-Paper
Advertisement

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్
Advertisement

Sony WF-C510: ప్రస్తుతం టెక్ మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ హవా జోరుగా సాగుతోంది. ఆఫీస్ వర్క్ అయినా, జిమ్‌లో వర్కవుట్లు అయినా ఇయర్ బడ్స్ ప్రతి ఒక్కరి లైఫ్‌ స్టైల్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ ఆడియో బ్రాండ్ సోని విడుదల చేసిన Sony WF-C510 ఇయర్ బడ్స్ టెక్కీలను, మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో వీటి ధర రూ.3,990 గా ఉంది. బడ్జెట్ ధరలో.. బ్రాండెడ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా

పూర్తి ఫీచర్లు:

సూపర్‌ కాంపాక్ట్ డిజైన్:

సోని కంపెనీ ఇప్పటి వరకు తయారు చేసిన క్లోజ్డ్-టైప్ ఇయర్ బడ్స్‌లో ఇవే చిన్నవి, తేలికైనవి. చెవులకు సరిగ్గా సరి పోయేలా వీటిని లేటెస్ట్ ఎర్గోనామిక్ డిజైన్‌తో తీర్చిదిద్దారు. చిన్న చెవులు ఉన్న వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గంటల తరబడి వీటిని ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు వచ్చే సిలిండ్రికల్ ఛార్జింగ్ కేస్ కూడా చాలా కాంపాక్ట్‌గా,పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్లూ, ఎల్లో, బ్లాక్, వైట్ వంటి ట్రెండీ కలర్ ఆప్షన్లలో ప్రస్తుతం ఇవి లభిస్తున్నాయి.

సౌండ్ క్వాలిటీ, DSEE టెక్నాలజీ:

Advertisement

సైజు చిన్నదైనా సౌండ్ విషయంలో సోని ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో.. వాడిన 6mm డైనమిక్ డ్రైవర్లు అద్భుతమైన ఆడియో ఫీల్ అందిస్తాయి. సోని వారి ప్రత్యేకమైన DSEE టెక్నాలజీ కారణంగా కంప్రెస్డ్ మ్యూజిక్ ఫైల్స్ కూడా హై-క్వాలిటీ సౌండ్‌తో వినిపిస్తాయి. అంతేకాకుండా.. ‘సోని | సౌండ్ కనెక్ట్’ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

యాంబియంట్ సౌండ్ మోడ్ , వాయిస్ ఫోకస్:

ట్రావెల్ చేసేటప్పుడు లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు చుట్టు పక్కల సౌండ్స్ తెలియడం చాలా ముఖ్యం. దీని కోసం ఇందులో యాంబియంట్ సౌండ్ మోడ్ ను అందించారు. దీని వల్ల పాటలు వింటూనే బయటి ప్రపంచంలోని శబ్దాలను స్పష్టంగా వినొచ్చు. అలాగే ‘వాయిస్ ఫోకస్’ ఫీచర్ ద్వారా చుట్టు పక్కల నాయిస్‌ను తగ్గించి, కాల్స్‌లో అవతలి వారి మాటలు క్లియర్‌గా వినపడేలా ఇది సహాయ పడుతుంది.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్:

Advertisement

ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఇయర్ బడ్స్ ఈజీగా 11 గంటల వరకు నాన్‌ స్టాప్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఇక ఛార్జింగ్ కేస్‌తో .. కలిపి ఇది మొత్తం 22 గంటల వరకు పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఒక వేళ బ్యాటరీ అయిపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు. కేవలం 5 నిమిషాల పాటు ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే దాదాపు 1 గంట పాటు నాన్‌ స్టాప్ పాటలు వినొచ్చు. USB టైప్-C పోర్ట్ ద్వారా దీన్ని చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.

మల్టీపాయింట్ కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు:

ఈ ప్రైస్ రేంజ్‌లో.. లభించే బెస్ట్ ఫీచర్లలో మల్టీపాయింట్ కనెక్షన్ ఒకటి. దీని సహాయంతో.. ఒకే సమయంలో రెండు బ్లూటూత్ డివైజ్‌లకు (ఉదాహరణకు ల్యాప్‌టాప్, ఫోన్) ఇయర్ బడ్స్‌ను ఒకే సారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫాస్ట్ పేర్, విండోస్ యూజర్ల కోసం స్విస్ పేర్ ఫీచర్లు వెంటనే కనెక్షన్‌ను అందిస్తాయి. అలాగే చెమట, నీటి బిందువుల నుంచి సేఫ్టీ కోసం IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఇందులో ఉంది.

రూ.3,990 బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్ నుంచి వస్తున్న బెస్ట్ వైర్‌ లెస్ ఇయర్ బడ్స్‌లో సోని డబ్ల్యూఎఫ్-సి510 ముందు వరుసలో ఉంటుంది. అద్భుతమైన డిజైన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, సోని బ్రాండ్ వాల్యూ కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు కూడా తక్కువ ధరలో హై-క్వాలిటీ ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే, నిస్సందేహంగా దీన్ని మీ లిస్ట్ లో చేర్చుకోండి.

Related News

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

Big Stories

Advertisement
×