E-Paper
Advertisement

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!
Advertisement

 Advertisement Policy: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మున్సిపల్ కార్పొరేషన్ లకు ఆదాయం సమకూరడంతో పాటు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అడ్వర్టైజ్మెంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇప్పటికే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ అమలుకు సర్కారు మంగళవారం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. క్యూర్ పరిధిలో తాత్కాలిక, హైపర్‌లోకల్‌ ప్రకటనలకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంఏయూడీ జీవో 926ను జారీ చేసింది.

సర్కారు ఆదేశాల..

Advertisement

ఈ నిబంధనలను జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు అమలు చేయాలని సర్కారు జీవోలో ఆదేశించింది. ప్రతి వార్డులో తాత్కాలిక, హైపర్‌లోకల్‌ ప్రకటనల స్థలాలను గుర్తించి, అనుమతులు ఇచ్చేందుకు వార్డు స్థాయి ప్రకటనల నోడల్‌ అధికారిని నియమించనున్నట్లు సర్కారు ఆదేశాలు పేర్కొంది. ఒక్కో వార్డులో సుమారు 5 నుంచి 10 టెంపరరీ అడ్వర్టైజ్ మెంట్ స్థలాలు, 25 నుంచి 50 హైపర్‌లోకల్‌ ప్రకటనల స్థలాలను గుర్తించి, సంబంధిత సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆమోదం తీసుకోవాలని ఆదేశాలు పేర్కొంది. ప్రకటనల కోసం ‘మై క్యూర్’ లేదా అడ్వర్టైజ్‌మెంట్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని. ఒక మొబైల్‌ నంబర్‌తో ఒకేసారి ఒక స్లాట్‌ మాత్రమే బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది.

ఫ్లెక్సీలు వేస్తే జరిమానా తప్పదు!

Advertisement

బుకింగ్‌ తేదీలు ఏడు రోజుల ముందుగానే అందుబాటులో ఉంటాయి. అనుమతి పొందిన ప్రకటనలపై కుడివైపు కింద క్యూర్ కోడ్‌, ఎడమవైపు ప్రింటర్‌ ఐడీ తప్పనిసరిగా ముద్రించాలన్న నిబంధనను అమలు చేయనున్నట్లు పేర్కొంది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనలను మున్సిపల్‌, పోలీసు అధికారులు, హైడ్రా వెంటనే తొలగించడంతో పాటు జరిమానాలు విధిస్తారని సర్కారు ఆదేశాలు పేర్కొంది. చెట్లు, వారసత్వ కట్టడాలు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్లైఓవర్లు, విగ్రహాలపై ప్రకటనలకు అనుమతి ఉండదని, తప్పుడు లేదా అభ్యంతరకర కంటెంట్‌ ఉన్న ప్రకటనల అనుమతిని రద్దు చేరునట్లు సర్కారు స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రకటనలకు గరిష్టంగా మూడు రోజులపాటు మాత్రమే అనుమతి ఉంటుందని,. గడువు తర్వాత పొడిగింపు ఉండదని,మళ్లీ కొత్తగా బుకింగ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

జరిమానాపై సర్కార్ స్పష్టం..

హైపర్‌లోకల్‌ ప్రకటనలకు గరిష్టంగా ఏడు రోజుల గడువు ఉంటుందని, తాత్కాలిక ప్రకటనలకు వర్గీకరణ ఆధారంగా రోజుకు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు, హైపర్‌లోకల్‌ ప్రకటనలకు రోజుకు రూ.100 నుంచి రూ.500 వరకు ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తాత్కాలిక ప్రకటనలకు రోజుకు రూ.2,000 నుంచి రూ.8,000 వరకు, హైపర్‌లోకల్‌ ప్రకటనలకు రోజుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించనున్నట్లు జీవో లో సర్కార్ స్పష్టం చేసింది.

Also Read: రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

Tags

Related News

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Big Stories

Advertisement
×