E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న కోసం శివనారాయణ ఫ్యామిలీ మొత్తం దక్షిణమూర్తి ఇంటికి వెళ్తారు. జ్యోత్స్న గురించి అడుగుతారు. మాలిని తనకు తెలియదని చెప్తుంది. దక్షిణమూర్తి అడిగినా తనకేం తెలియదని అసలు జ్యోత్స్న గురించి తానెందుకు పట్టించుకుంటానని చెప్తుంది. కూతురు ఎక్కడికో వెళ్లిపోతే వెతుక్కోకుండా ఇక్కడకు రావడం ఏంటి మూర్ఖత్వం కాకపోతే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మాలిని.

మాలిని మాటలకు శివనారాయణ అందుకే ఇక్కడకు వచ్చాం అని చెప్తాడు. సూరజ్‌ అడ్డు పడితే సూరజ్‌ను తిడతాడు. నువ్వు మనిషివేనా..? అప్పుడు ప్రేమ పేరుతో నా మనవరాలిని మోసం చేశావు.. ఇప్పుడు మాయం చేశావు.. అంటూ తిడతాడు. దీప కూడా మాలినిని తిడుతూ నువ్వే జ్యోత్స్నను ఏదో చేశావని దీప అడిగితే.. నువ్వేదో దానికి తోడబుట్టిన అక్క అయినట్టు ఫీలవుతున్నావు అంటుంది మాలిని. అందుకు దీప ఎమోషనల్‌ అవుతూ అవును జ్యోత్స్న నా చెల్లె.. ఒకే తల్లి ప్రేమ పంచుకున్న అక్కాచెల్లెల్లం మేము అని చెప్తుంది. కార్తీక్‌ కూడా మాలిని చెప్పిన మాటలు గుర్తు చేస్తాడు. జ్యోత్స్న ఏదో ఒకటి చేస్తానని మాలిని శపథం చేసింది గుర్తు చేస్తాడు. అందుకే నీ మీద అనుమానంతో ఇక్కడికి వచ్చామంటాడు.

Advertisement

దశరథ్‌ కోపంగా సూరజ్‌ దగ్గరకు వెళ్లి కాలర్‌ పట్టుకుని నా కూతురును ఏం చేశావో చెప్పరా అంటూ నిలదీస్తే.. సూరజ్‌ కోపంగా మేము మనుషులను చంపేవాళ్లలా కనిపిస్తున్నామా..? అయినా మీ కూతురు ఎక్కడికో వెళితే మమ్మల్ని అడగటం ఏంటి..? అంటూ సూరజ్‌ చెప్పగానే.. దక్షిణమూర్తి కోపంగా సూరజ్‌ కాలర్‌ విడిచిపెట్టమని దశరథ కాలర్‌ పట్టుకుంటాడు. వెంటనే శివనారాయణ కోపంగా దక్షిణమూర్తి కాలర్‌ పట్టుకుంటాడు. దీంతో దక్షిణమూర్తి, శివనారాయణ మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవలో శివనారాయణ షర్ట్‌ చిరిగిపోతుంది. దక్షిణమూర్తి కోపంగా నా మనవరాలు నా దగ్గరకు వస్తుందని తెలిసి.. రాకుండా ఉండేందుకు మీరే జ్యోత్స్నను ఎక్కడో దాచేసి.. మేమే ఏదో చేశామని ఉల్టా వాదిస్తున్నారా..? అంటూ తిడతాడు. తర్వాత దక్షిణమూర్తి డబ్బులు తీసి దశరథకు ఇచ్చి మీ నాన్నకు కొత్త షర్ట్‌ కొనివ్వు అంటాడు. దశరథ ఆ డబ్బులు తీసి ఇవ్వబోతుంటే.. శివనారాయణ ఆ డబ్బులు అలాగే ఉండనివ్వు.. వాటిని తిరిగి ఇచ్చే టైం వస్తుంది దశరథ అని చెప్తాడు.

కట్‌ చేస్తే అందరూ కాంచన ఇంట్లో కూర్చుని జ్యోత్స్న గురించి టెన్షన్‌ పడుతుంటారు. కార్తీక్‌, దీప వల్లే ఇదంతా జరిగిందని శివనారాయణ కోప్పడుతుంటాడు. జ్యోత్స్న ఆఫీసులో జాబ్‌లో జాయిన్‌ అయినప్పుడే మనకు చెప్పి ఉండాల్సింది. అలా చెప్పకుండా దాచేసి ఇంత గొడవకు కారణం అయ్యారు అంటూ తిడుతుంటారు. ఇలా వీళ్లను నిందిస్తే కూర్చుంటే ఎలా మనం జ్యోత్స్న గురించి పోలీస కంప్లైంట్‌ ఇద్దామని సుమిత్ర అంటుంది. అందరూ చర్చించుకున్న తర్వాత పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వడానికి వెళ్తారు.

Advertisement

కట్‌ చేస్తే సుమిత్ర పోలీసులతో దక్షిణమూర్తి ఇంటికి వెళ్తుంది. పోలీసులు మాలినిని అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్తారు. ఎందుకని మాలిని అడిగితే.. సుమిత్ర కంప్లైంట్‌ ఇచ్చిందని వాళ్ల అమ్మాయిని మీరు కిడ్నాప్‌ చేశారని అందుకే ఆవిడ కేసు పెట్టిందని చెప్తారు. ఆ మాటలకు మాలిని ఎమోషనల్‌ అయినట్టు నటిస్తూ.. ఆరోజు ఇలాగే ఇంటి మీదకు పోలీసులను పంపించావు.. ఈరోజు పోలీసులను తీసుకుని ఇంటికి వచ్చావు సుమిత్ర ఇదంతా చేసేకంటే నా గొంగు నులిమి నన్న చంపేయ్‌ అంటూ సుమిత్ర చేతులు తీసుకుని తన గొంతు మీద పెట్టుకుని ఎమోషనల్ అవుతుంది మాలిని. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×