Big Stories

Electric Bike Insurance : ఎలక్ట్రిక్ బైక్ లకు ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే..

Electric Bike Insurance : మీ దగ్గర ఎలక్ట్రిక్ బైక్ గానీ, స్కూటీ గానీ ఉందా? లేక కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే… వాటి ఇన్సూరెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే… బ్యాటరీల్లో లోపాల కారణంగా ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒకవేళ అనుకోని ప్రమాదమేమైనా జరిగి ఎలక్ట్రిక్ వెహికల్ కాలిపోతే… దాని కోసం ఖర్చు చేసిన పూర్తి సొమ్ము తిరిగి వచ్చేలా ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ఎలాంటి నష్టం లేకుండా బయటపడొచ్చు.

- Advertisement -

పెట్రోల్ బండ్లతో పోలిస్తే… ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర బాగా ఎక్కువ. అందుకే వాటికి ఎక్కువ కవరేజీ ఉండే పాలసీ తీసుకోవాలి. ఎదుటి వ్యక్తికి లేదా ఎదుటి వాహనానికి జరిగే నష్టానికి మాత్రమే కవరేజీ కల్పించే థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకునే బదులు… వాహనం అంతటికీ సమగ్ర కవరేజీ కల్పించే కాంప్రెహెన్సివ్‌ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. అప్పుడే నష్టం జరిగినా… వాహన యజమానికి భరోసా ఉంటుంది. మామాలుగా పెట్రోల్ వాహనాల విలువను ప్రతీ ఏడాది కాస్త తగ్గించి… దాని ధర నిర్ధారించి బీమా కవరేజీ ఇస్తుంటారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఇలాంటి తరుగుదల లేకుండా పూర్తి విలువకు బీమా ప్రయోజనం కలిగేలా జీరో డిప్రిషియేషన్‌ యాడ్‌ఆన్‌ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీనికి ప్రీమియం కాస్త ఎక్కువైనా… వాహనానికి నష్టం జరిగితే పూర్తి విలువ రాబట్టడం కోసం ఈ యాడ్‌ ఆన్‌ తీసుకుంటే బెటర్.

- Advertisement -

ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్ వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు… దాని మార్కెట్‌ విలువకు సమీపంగా ఏ కంపెనీ ఇన్సూర్డ్ డిక్లేర్ వాల్యూ ఇస్తోందో పరిశీలించి… బీమా తీసుకోవాలి. వాహనం చోరీకి గురైనా, ఇంకేదైనా నష్టం జరిగినా… వాహనం పూర్తి విలువ తిరిగి వస్తుంది. ఇక పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఒక ఊరి పరిధిలోనే వాడతారు కాబట్టి… అవి తక్కువ దూరం తిరుగుతాయి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వాహనం మీద తక్కువ దూరం తిరిగేట్టయితే… ఆ దూరానికే బీమా తీసుకునేలా… పే యాజ్ యూజ్ యాడ్ ఆన్ అందుబాటులో ఉంది. అది అందిస్తున్న కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకుంటే… కాస్త తక్కువ ధరలో రావొచ్చు. కాబట్టి… ఎలక్ట్రిక్ బైక్ కు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే… ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే… నిశ్చింతంగా ఉండొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News