Big Stories

Husband Wife Fighting:ఇంట్లో తరచూ భార్యభర్తలు గొడవ పడుతున్నారా…..

Husband Wife Fighting:మొగుడు, పెళ్లాల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. కాని కొంతమంది నిత్యం పరస్పరం కలహించుకుంటూనే ఉంటారు. సమస్యలు, విభేదాలతో భార్య భర్తలు ఇరువురి మధ్య పరస్పర నిందారోపణలు అధికమై తీవ్రమైన విభేదాలు ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యల్లో ఆలు మగలు తమకు సమీపంలో ఉన్న నదీ, కొలను, లేదా సరస్సులో బుధవారం రోజు పుణ్య స్నానాలు ఆచరించి దగ్గరలో ఉన్న లక్ష్మీ నారాయణ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆలయంలో శక్తి కొద్దీ పూజలు లేదా అర్చనలు చేయించాలి. ముఖ్య అర్చక స్వామికి దక్షిణ ఇచ్చి, పాదాబివందనం చేసి, అర్చక స్వామి వారి ఆశీస్సులు పొందాలి. ఆ రోజంతా మౌనంగా ఉండి రాత్రి వేళలో చంద్ర దర్శనం/నక్షత్ర దర్సనం అనంతరం ఇరువురు కలిసి భోజనం చేయాలి.

- Advertisement -

భర్త ముత్యపు ఉంగరం, భార్య పగడపు ఉంగరం ధరించాలి. ఈ విధంగా ఐదు బుధవారాలు చేయాలి. భార్య భర్తలు ఇద్దరి మధ్య పూర్తి అనుకూలంగా మార్పులు జరిగి, సుఖసంతోషాలతో దాంపత్య జీవితాన్ని సాగిస్తారు.భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వారికి వివాహం జరిగిన తేదీ అంటే పంచాగ తిథి ప్రకారం పుణ్య స్నానాలు ఆచరించి భార్య మెడలో వెండి గొలుసు, భర్త చేతికి వెండి బ్రాసిలేట్ ధరించి, దగ్గర లో ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. భర్త యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం మంచిది. ఇలా పన్నెండు నెలలు తప్పకుండా చేస్తే, దాంపత్య జీవితంలో అనుకూలంగా మార్పులు జరిగి, సుఖసంతోషాలతో దాంపత్య జీవితాన్ని సాగిస్తారు.

- Advertisement -

అలాగే 11 శుక్రవారాలు శ్రీ చక్రార్చన కుంకుమ పూజ, శ్రీ లలితా సహస్రనామంతో సాయంత్రం దీపాలు పెట్టాక చేయించాలి. శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేసి, పట్టు రవిక, బొట్టు, గాజులు, కాటుక, అద్దం, అత్తరు, ఆకు వక్క, దక్షిణతో కలిపి ఐదుగురు ముత్తైదువులకు పాదములకు పసుపు రాసి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టి వాయినం ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ఉపవాసం ఆచరిస్తూ చేయాలి. అలా ఆచరిస్తే మొగుడు పెళ్లాల మధ్య బలపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News