Raipur Crime News: ఛత్తీస్‌గఢ్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. లాడ్జిలో ఓయువతి తన బాయ్‌ఫ్రెండ్ గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి జరిగినదంతా తల్లికి చెప్పింది. తల్లి సూచనతో నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. బాలిక చెప్పిన కారణాలు విని షాకయ్యారు పోలీసులు. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
లాడ్జిలో ఏం జరిగింది?
ఈ మధ్యకాలంలో యువతీ యువకుల మధ్య పరిచయం మొదలవుతుంది. ఆ తర్వాత స్నేహం.. చివరకు ప్రేమగా మారుతుంది. ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలు లేకుంటే గొంతు కోసి చంపేయడం జరుగుతుంది. ఆ టేనేజ్ యువతి విషయంలో అదే జరిగింది. రాయ్‌పూర్ సిటీలో ఊహించని ఘటన వెలుగులోకి చూసింది. ఆదివారం గంజ్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో ఓ లాడ్జి నుండి యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దారుణహత్యకు అతడి 16 ఏళ్ల స్నేహితురాలని తెలిసి షాకయ్యారు.
బీహార్‌కు చెందిన సద్దాం ఓ అధికారిగా పని చేస్తున్నాడు. అతడి వయస్సు 20 ఏళ్లు. అతడికి బిలాస్‌పూర్‌కి చెందిన 16 ఏళ్ల యువతి పరిచయం అయ్యింది. కొద్దిరోజులుగా వీరిద్దరు రాయ్‌పూర్‌లోని అవాన్ లాడ్జ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో టీనేజ్ యువతి గర్బవతి అయ్యింది. గర్భస్రావం చేయించుకోవాలని యువతిపై సద్దాం ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చెడింది.
మూడునెలల గర్భవతి
ఆ తర్వాత యువతి బిలాస్‌పూర్ వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ప్రియుడ్ని కలిసేందుకు రాయ్‌పూర్ వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. కత్తితో యువతిని బెదిరించే ప్రయత్నం చేశాడు సద్దాం. అప్పటికే కోపంతో రగిలిపోయిన యువతి.. తన జీవితాన్ని నాశనం చేసినవాడ్ని ఉంచకూడదని నిర్ణయించుకుంది.
ALSO READ: ఇన్‌స్టా ప్రేమ.. పేరెంట్స్ మందలింపు
సరిగ్గా సెప్టెంబర్ 28న రాత్రి సద్దాం లాడ్జ్ గదిలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో పదునైన ఆయుదాన్ని తీసుకొని అతడి గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఆమె గదిని బయట తాళం వేసి సద్దాం మొబైల్ ఫోన్ తీసుకొని పారిపోయింది. లాడ్జ్ గది తాళాన్ని సమీపంలోని రైల్వే పట్టాలపై విసిరేసింది. అక్కడి నుంచి నేరుగా బిలాస్‌పూర్‌లో ఇంటికి వెళ్లింది.
తల్లితోపాటు కూతురు
మరుసటి రోజు ఉదయం జరిగినదంతా తల్లికి చెప్పింది. షాక్‌కు గురైన ఆమె తల్లి వెంటనే కూతుర్ని తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పి ఫిర్యాదు చేసింది. చివరకు రాయ్‌పూర్ పోలీసులు ఆ లాడ్జ్‌కు చేరుకున్నారు. సద్దాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సద్దాం ఫోన్‌ని పోలీసులకు ఇచ్చింది నిందితురాలు.
బీహార్‌లోని సద్దాం కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మైనర్ బాలికను విచారిస్తున్నారు. జువెనైల్ జస్టిస్ చట్టం కింద బాలికను అదుపులోకి తీసుకున్నారు. యువతి మూడు నెలల గర్భవతి అని తేలింది. వివాహం చేసుకోవడం ఇష్టంలేక ఇద్దరి మధ్య గొడవలు జరిగి చివరకు హత్యకు దారితీసినట్టు తేలింది.