Big Stories

Prevent Cancer: క్యాన్సర్‌కు చెక్‌పెట్టే క్యాలీఫ్లవర్‌

Prevent Cancer:క్యాలీఫ్లవర్‌లు చాలామంది తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. కానీ దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఈ క్యాలీఫ్లవర్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో వృక్ష సంబంధ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే క్యాలీఫ్లవర్‌ను తరచుగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. క్యాలీఫ్లవర్‌తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. క్యాలీఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకని దీన్ని తరచూ తీసుకుంటే శరీరానికి చక్కటి పోషణ లభిస్తుంది. కాలీఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక కప్పు క్యాలీఫ్లవర్ తినడం వల్ల రోజువారి కావాల్సిన ఫైబర్‌లో పది శాతం లభిస్తుంది. దీనివల్ల మన జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. వాపులు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాలీఫ్లవర్‌ను తరచూ తీసుకుంటే మలబద్ధకం, ఇన్‌ఫ్లమెంటరీ బోవెన్‌లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్ రాకుండా క్యాలీఫ్లవర్ అడ్డుకుంటుంది. క్యాలీఫ్లవర్‌లో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. క్యాలీఫ్లవర్‌ ఫ్రీ రాడికల్స్ బారి నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా వాపులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. పెద్దపేగు, ఊపిరితిత్తులు, బ్రెస్ట్, ప్రొటెస్ట్ క్యాన్సర్ వంటివి మన దరి చేరవు. ఈ క్యాలీఫ్లవర్‌లో ఉండే కెరోటినాయుడ్లు గుండెజబ్బులు రానివ్వకుండా చూస్తాయి. అలాగే క్యాలీఫ్లవర్‌లో అధికంగా ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాలీఫ్లవర్‌లో కొలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కణాలకు శక్తిని ఇస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచేందుకు బాగా పనిచేస్తుంది. లివర్లలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. నాడీ మండల వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ క్యాలీఫ్లవర్‌లోని ఫైబర్ మన జీర్ణశయాన్ని ఫుల్‌గా ఉంచుతుంది. దీంతో కడుపునిండిన భావన కలుగుతుంది. ఆకలి సైతం నియంత్రణలో ఉంటుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. క్యాలీఫ్లవర్‌లో సల్ఫర్ ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా చూస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె జబ్బులు మన దరి చేరవు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News