చేసిన నేరానికి కచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. రెండు దశాబ్దాల క్రితం అమెరికాలోని లాంగ్ ఐలాండ్ లో ఘోరమైన ప్రమాదానికి కారణమైన భారతీయుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని జైలుకు పంపించినట్లు నసావు కౌంటీ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. నేరం చేసిన అతడిని ఇంతకాలం ఎందుకు పట్టుకోలేదని చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
54 ఏళ్ల గణేష్ షెనాయ్.. 2005లో లాంగ్ ఐలాండ్ లో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో హిక్స్ విల్లేకు చెందిన ఫలిప్ మాస్ట్రోపోలో చనిపోయాడు. ఇంటి నుంచి చిన్న పని మీద కారులో వెళ్తుంగా.. ఓల్డ్ కంట్రీ రోడ్‌లో రెడ్ లైట్‌ను దాటిన షెనాయ్ చాలా వేగంగా కారు నడుపుతూ మాస్ట్రోపోలో వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మాస్ట్రోపోలో ప్రాణాలు కోల్పోయాడు. షెనాయ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసు నడుస్తుండగా, షెనాయ్ మొదట తన పాస్‌పోర్ట్ ను పోలీసులకు అప్పగించాడు. ఆ తర్వాత కొత్త పాస్ పోర్ట్ తీసుకున్నాడు. చికిత్స పొందే హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. గత 18 ఏండ్లుగా బెయిల్ మీద ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నాడు. అంతేకాదు, అమెరికాకు తనను అప్పగించకూడదని కోర్టులో కేసు కూడా వేశాడు.
మరోవైపు అమెరికా అధికారులు షెనాయ్ ని అప్పగించాలని అమెరికా అధికారులు భారత్ ను కోరారు. 18 సంవత్సరాల తర్వాత ఇండియా అతడిని అమెరికాకు అప్పగించింది. ఈ సెప్టెంబర్ 26న(శుక్రవారం) అతడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. తాను శిక్ష నుంచి తప్పించుకున్నానని భావించినప్పటికీ ఇండియా తీసుకున్న నిర్ణయంతో అతడు షాకయ్యాడు. మాస్ట్రోపోలోచనిపోయిన ఆయన ఇద్దరు పిల్లలు చిన్న వాళ్లు. ఇప్పుడు వాళ్లు కోర్డుకు హాజరయ్యారు. ఇన్నాళ్లకు తన తండ్రి చావుకు కారణం అయిన వ్యక్తి అరెస్టు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తాజాగా కోర్టుకు హాసరైన మాస్ట్రోపోలో ఫ్యామిలీ మెంబర్స్ ఇంత కాలం తర్వాత నిందితుడు అరెస్ట్ కావడంతో న్యాయం పట్ల తమకు నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఫిలిప్ మాస్ట్రోపోలో మంచి వ్యక్తి. అకారణంగా ఆయన చనిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత న్యాయం జరుగుతుందని మేం ఊహించలేదు. ఇప్పుడు తమకు అన్యాయం చేసిన వ్యక్తికి శిక్ష పడుతుందని భావిస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి మాకు న్యాయం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన అన్ని ఏజెన్సీలకు ధన్యవాదాలు చెప్తున్నాం” అన్నారు.
నిజానికి 2005లో షెనాయ్ యాక్సిండెంట్ చేసినా, ఇప్పటి వరకు అతడు ఇండియాలో కోర్టులను ఆశ్రయించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఆయనకు న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ అయిపోవడంతో అమెరికాకు అప్పగించాల్సి వచ్చింది. నాసావు కౌంటీ న్యాయమూర్తి అతడిని బెయిల్ లేకుండా నిర్బంధించాలని ఆదేశించారు.
Read Also: సరస్సులో పర్యాటకుల పడవ ప్రయాణం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఏనుగు..