E-Paper
Advertisement

2023 calendar : కొత్త క్యాలెండర్ ఆ దిశలో పెట్టుకుంటే శుభఘడియలే

2023 calendar : కొత్త క్యాలెండర్ ఆ దిశలో పెట్టుకుంటే శుభఘడియలే
Advertisement

2023 calendar : కొత్త సంవత్సరం వస్తోంది. రంగు రంగుల కొత్త క్యాలెండర్లు వచ్చేశాయి. మరి పాత క్యాలెండర్లు ఏం చేయాలి. ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. కొంతమంది క్యాలెండర్లు పాతవి కూడా ఉంచేస్తుంటారు. అది సరికాదు. పాతది తొలగించి కొత్తది ఏర్పాటు చేసుకోవాలి . దీని వల్ల గడిచిన కాలం కంటే రాబోయే కాలంలో అంటే కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఏడాది పొడవుగా ప్రయోజనం కలుగుతుంది. గడిచిన కాలం దగ్గరే ఆగిపోకూదనే చెప్పేందుకే ఈ పద్దతి పెట్టారు.

అలాగే కొత్త క్యాలెండర్ ని ఏదిశలో పెడుతున్నామో కూడా ఒకసారి పరిశీలించాలి . వాస్తు ప్రకారం కొత్త క్యాలెండర్ ని ఇంట్లో పెట్టేటప్పుడు ఉత్తరం, తూర్పు, పడమర వైపు పెట్టడం వల్ల చాలా మంచి కలుగుతుంది. కొత్త క్యాలెండర్ ని ఇంట్లో పెట్టాలంటే ఉత్తరం, తూర్పు, పడమర వైపునే ఉంచండి. ఇది పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తూ నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.. పడమర దిశలో క్యాలెండర్ పెట్టుకోవడం వల్ల చేసే పనులు వేగవంతం అవుతాయి. పని సమర్థత కూడా పెరుగుతుంది.

Advertisement

మనం నిత్యం చూసే క్యాలెండర్ ని దక్షిణం దిక్కు వైపు అస్సలే ఉంచకూడదు. ఆ దిక్కులో ఉంచడం వల్ల సమస్యలు వెంటాడతాయి. అలాగే క్యాలెండర్ లో ఉదయిస్తున్న సూర్యుడు, ధనం వంటి ఫోటోలు ఉండొచ్చు. కానీ క్రూర జంతువులు, బాధ కలిగించేవి, విచారకరంగా ఫోటోలతో ఉన్న క్యాలెండర్లు ఉంచకూడదు. క్యాలెండర్ లో ఎప్పుడు కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు, పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటే మంచిది. ఈ రంగులు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి.

క్యాలెండర్ ని నార్త్ ఫేసింగ్ లో ఉంచడం వల్ల కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. గ్రీనరీ, ఫౌంటెన్, పెళ్లి ఫోటోలు వంటివి ఉంచుకోవడంలో తప్పులేదు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×