Kartika Shuklapaksha Trayodashi : కార్తీకమాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే.. ప్రతి పూజ ఓ ఫలమే..శివకేశవులకు ఇష్టమైన మాసం . శివారాధనకు, విష్ణు ఆరాధనకు కార్తీక మాసము కన్నా ఉత్తమమైన మాసము లేదు. కార్తీక బహుళ త్రయోదశి రోజు నవగ్రహ ఆరాధన చేసినటట్లయితే గ్రహ దోషములు తొలుగుతాయి. కార్తీక విధులను అనుసరిస్తూ, వీలయితే సాలగ్రామం దానం చేయాలి. ఈరోజున కూడా ఉపవాసం ఉండాలి. రాత్రి పూట భోజనం చేయరాదు. త్రయోదశి తిథికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈరోజున చేసే పుణ్య కార్యక్రమాల వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.
కార్తీక మాసంలో వచ్చే శని ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజు పరమేశ్వరుడు, శని దేవుడికి అంకితం ఇవ్వబడింది.
కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజిస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం. చాంద్రాయణవ్రత ఫలము పొందుతారు. కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజిస్తే పాపవిముక్తులవుతారు. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పిస్తే మోక్షం ప్రాప్రిస్తుంది. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలు పెట్టేవాళ్లు, పురాణమలు చెప్పేవారు పురాణములు వినివారు పరమపదం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
శని ప్రదోష వ్రతం ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించి తర్వాత ఈశ్వరుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉండాలి. మీ ఇంట్లోని పూజా గదిలో పరమేశ్వరుడి విగ్రహం లేదా ఫొటోకు తెల్ల చందనం, అక్షింతలు, పూలు, పూల హారాలు, బెల్లం, శమీ ఆకులు, బిల్వ పత్రాలు తదితర వస్తువులను సమర్పించాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత ధూపం వెలిగించాలి. అనంతరం ప్రదోష వ్రత కథను చదవాలి. అదే విధంగా శివ చాలీసా, శివ మంత్రాలను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. ఈరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివ పూజ చేయాలి.