BigTV English
Advertisement

Navami Day:- నవమి రోజు ఈ ఒక్కమంత్రం పటిస్తే ఎంత పుణ్యమో!

Navami Day:- నవమి రోజు ఈ ఒక్కమంత్రం పటిస్తే ఎంత పుణ్యమో!

Navami Day:- శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌల్య గర్భమును చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు. అందువలన ప్రతీ సంవత్సం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తోంది. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటారు.


అతనికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీమహా విష్ణువు అతనిని సంహరించడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్ముణునిగా, శంఖ చక్రములు భరత, శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు. ఒక రోజు పార్వతీ దేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు ఒక శ్లోకం చెప్పాడు.

శ్లో|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే చాలు ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకురుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారి సథ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మానవులకు రామనామస్మరణ’ జ్ఝానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది. రామ అంటే రమించుట అని అర్ధం. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచి పెడుతారు.భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్టప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు, పంపించడం సంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

మిగతా దేవుళ్లతో పోల్చితే సీతారాములు స్పెషల్

for more updates follow yhis link:-Bigtv

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×