BigTV English

Organ Donation : అవయవదానం చేస్తే వచ్చే జన్మలో అవయవలోపంతో పుడతారా…?

Organ Donation : అవయవదానం చేస్తే వచ్చే జన్మలో అవయవలోపంతో పుడతారా…?

Organ Donation : ఎంత టెక్నాలిజీ డెవలెప్ అయినా మనిషి సాధించలేనివి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఏంటనేది ఏ శాస్త్రవేత్త చెప్పలేడు ఏ సైన్సు కనిపెట్టలేదు. . కాని నాటి మునులు, రుషులు తపో శక్తి చాలా ఆ విషయాన్ని గ్రహించి కొన్ని విషయాలు మనకి గ్రంధాల రూపంలో చెప్పారు. ముఖ్యంగా అవయవదానం చేస్తే వచ్చే జన్మలో అవయవలోపంతో పుడతారన్న సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఒంట్లో ఏ పార్ట్ దానం చేస్తారో అది లేకుండా వచ్చే జన్మలో పుడతారని అభిప్రాయం ఉంది. కాని అది నిజం కాదని అంటోంది శాస్త్రం.


శిబి చక్రవర్తలాంటి వాళ్లు దానం కోసం తన శరీరాన్ని ముక్కలు ముక్కలు కోసి ఇచ్చిన కథ మనకు తెలుసు. కారణం ఆయన ఎలాంటి మనిషో పురాణాలు చెప్పాయి. . ఆరోజుల్లో అవయవదానంలాంటివి నేరుగా ప్రస్తావించపోయినా…అవయవాన్ని కోల్పోతే ఏం చేయాలో చెప్పారు. నిమిషాల్లో కాలిపోయి పంచభూతాల్లో కలిసిపోయిన శరీరం ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే మనిషికి కావాల్సింది మరొకటి ఉండదు. చనిపోయిన తన అవయవాలు వేరే వారికి దానం చేస్తే వారి రూపంలో బతికే ఉంటాడు. కానీ అవయవ దానం చేసేటప్పుడు ఆ మనిషికి ఇష్టం లేకుండా మాత్రం చేయకూడదు.

ఏదైనా యాక్సిడెంట్ లో ఏదో అవయవం కోల్పోతే దహన సంస్కారాల సమయంలో అవేమీ పోలేదని ఫీలింగ్ కలగడానికి ప్రాయశ్చితం చేస్తూ కొన్ని మంత్రాలు చదువుతారు. మనిషి చనిపోయిన తర్వాత అందులో నుంచి జీవుడు బయటకొచ్చినా పూర్వజన్మ వాసనలు ఉంటాయంటో శాస్త్రం. సోల్ మెమరీలో ఫలానా అవయవం లేదని ఫీలింగ్ మిగిలిపోతే తర్వాత జన్మలో కూడా అది గుర్తుపెట్టుకుని జీవిస్తాడట. లోపం గుర్తున్నప్పుడు ఆ అవయవం సరిగా పనిచేయదు. ఆ అవయవం ఉన్నా పనిచేయనట్టే భావిస్తాడు. అందుకే ఇలాంటి ప్రమాదాన్ని ఊహించి మన రుషులు ప్రాయశ్చిత్తం అనే సంప్రదాయాన్ని ఆనాడే కనిపెట్టారు. ఆ మంత్రం శక్తితో అతనిలో ఎలాంటి లోపాలు లేవన్న భావన కలిగించేలా చేయడమే అసలు ఉద్దేశం.


Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×