BigTV English

5 Lucky Signs : ఈ ఐదు మీ ఇంటికి వస్తే అదృష్టమే

5 Lucky Signs : ఈ ఐదు మీ ఇంటికి వస్తే అదృష్టమే


5 Lucky Signs : ఇంట్లో చలి చీమలు తిరుగుతున్నట్టు మీకు కనిపిస్తే అదృష్టం మిమ్మల్ని పలకరించబోతోందని సంకేతం. ఇంటి లోపలకి చీమలు ఏదైనా తీసుకువస్తుంటే మీకు ధన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఉన్నట్టుండి ఒక్కోసారి నల్ల చీమలు కనిపిస్తాయి. అంతలోనే మాయమవుతాయి. వాస్తవానికి నల్లని చీమలు హానీ చేయవు. వాటి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చలి చీమలు నిత్యం తిరుగుతుంటే ఆర్థిక కష్టాలు మీ దరి చేరవు. ఉత్తరదిశ నల్లచీమలు ఇంట్లోకి వస్తే మీకు మంచిరోజులు వస్తున్నాయని సంకేతమని శకున శాస్త్రం చెబుతోంది.

కొందరు కప్పల్ని చూస్తే ఆమడదూరం పారిపోతారు. కాని ఇంటికి కప్పలు వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టేనంటున్నారు పెద్దలు. ఐశ్వర్యలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుందని చెప్పడానికి సంకేతంగా భావించాలి. రామ చిలుక కుబేరుడి సంకేతం. అది ఇంటి గుమ్మంలో వాలిన మీ ఇంటిలోకి వచ్చినా శుభసంకేతమే . రామచిలక అదృష్ట పక్షిగా భావిస్తారు. ఇంట్లో రామచిలక ధనసంపద డబుల్ అవుతుంది. పూర్వం రోజుల్లో ఇంట్లోకి చిలుకలు వచ్చే విధంగా వాతావరణం ఏర్పాటు చేసేవారు. ఇంట్లో రామచిలుక ఫోటో పెట్టుకున్నా మంచిదే. అది పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.


ఎవరకి హానీ చేయని రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మీ ఇల్లు లక్కీ హోమ్ గా మారబోతోందని సంకేతం. ఐశ్వర్యలక్ష్మి పలుకరించడంతో మీ జీవితమే మారిపోతుంది. ధన, ధాన్య రాశులకి మీకు తిరుగుండదు. నిత్యం ఇల్లు కళకళలాడుతుంది. శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన కూర్మావతారం తాబేలు ఇంటికి వస్తే లక్ష్మీదేవి పాకుతూ ఇంట్లోకి అడుగు పెట్టినట్టేనంటోంది శాస్త్రం. వారికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారు. తాబేలు రావడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్ధిక కష్టాలు తొలగిపోవడంతో మనశ్శాంతితో ఉంటారు. హిందూ సంప్రదాయంలో పిల్లిని అశుభంగా భావిస్తుంటారు. కాని అలాంటి పిల్లి ఇంట్లో పిల్లలు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటారు. పిల్లి జన్మినిచ్చన ఇల్లాంతా ధనరాశులతో నిండుతుందని సూచికగా చెబుతున్నారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×