E-Paper
Advertisement

Injection:- సూది లేకుండా ఇంజెక్షన్.. నొప్పి ఉండదు..!

Injection:- సూది లేకుండా ఇంజెక్షన్.. నొప్పి ఉండదు..!
Advertisement

Injection:- వయసుతో సంబంధం లేకుండా డాక్టర్లు ఇంజెక్షన్ ఇస్తామన్న ప్రతీసారి టాబ్లెట్స్ ఇవ్వచ్చుగా అని అడిగేవారు చాలామంది ఉంటారు. ఇంజెక్షన్ అంటే ఎందుకు భయం అంటే.. ప్రత్యేకంగా కారణం చెప్పలేకపోయినా.. చాలామందికి కచ్చితంగా ఈ భయం ఉంటుంది. ఆ భయం ఇంజెక్షన్‌కు ఉండే సూది వల్లే అని వైద్యులు అభిప్రాయపడుతుంటారు. అందుకే ఇంజెక్షన్ కోసం ఇకపై సూదిని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఓ కొత్త మార్గం అందుబాటులోకి రానుంది.

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హెల్త్ సెక్టార్‌లో చాలా మార్పులు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అవ్వడం కూడా దీనికి ఒక కారణం. ఒకప్పుడు ఆపరేషన్లు అనేవి చాలా క్లిష్టంగా ఉండేవి. అంతే కాకుండా వాటి సక్సెస్ రేట్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. మనిషి శరీరంలోకి కత్తి దిగకుండానే ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇదే పద్ధతి ఇంజెక్షన్స్ విషయంలో కూడా రానుందని తెలుస్తోంది.

Advertisement

ఇంజెక్షన్‌ను సూదికి బదులుగా కంప్రెస్డ్ గ్యాస్‌తో ఇవ్వవచ్చని యూఎస్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి నొప్పి లేకుండానే మందును మన శరీరంలోకి పంపిచగలుగుతుంది అంటున్నారు. కంప్రెస్డ్ గ్యాస్ అనేది ఇప్పటికే వైద్యరంగంలో వివిధ రకాలుగా వినియోగిస్తున్నారు. కానీ ఇంజెక్షన్‌కు బదులుగా దీనిని ఇవ్వవచ్చన్న ఆలోచన మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కంప్రెస్డ్ గ్యాస్ ఇంజెక్షన్ అనేవి వెటర్నరీ దగ్గర నుండి వ్యవసాయం వరకు చాలా రంగాల్లో అందుబాటులో ఉన్నదే. అయితే ఇది త్వరలోనే మనుషులకు ఉపయోగపడేలా తయారవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటికే శాస్త్రవేత్తలు కంప్రెస్డ్ గ్యాస్ ఇంజెక్షన్స్‌పై పలు పరిశోధనలు చేశారు. అవన్నీ సక్సెస్ అవ్వడంతో వారి రిజల్ట్స్‌ను అమెరికన్ కెమికల్ సొసైటీకి చూపించారు. చాలాకాలం క్రితం పేషెంట్ శరీరంలోకి తక్కువ మోతాదులో మందును పంపాలంటే కంప్రెస్డ్ గ్యాస్ ఉపయోగించేవారని చెప్తుంటారు. అదే పద్ధతి మళ్లీ మరింత మెరుగ్గా అందుబాటులోకి రానుంది. ఎమ్ఓఎఫ్ జెట్ పేరుతో వారు ఒక ఎయిర్ ఇంజెక్షన్‌ను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఎలుకలపై దీని ప్రయోగం సక్సెస్ అయ్యింది.

Advertisement

సంగీతంతో ఆ వ్యాధికి చికిత్స.. సక్సెస్‌ఫుల్‌గా పరిశోధనలు..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×