E-Paper
Advertisement

Honeycomb: ఇంట్లో తేనెపట్టు అశుభ సంకేతమేనా…

Honeycomb:  ఇంట్లో తేనెపట్టు అశుభ సంకేతమేనా…
Advertisement

Honeycomb : తేనెటీగలు మంచివే.. అవి మనకు ఎంతో మేలు చేస్తాయి. వాస్తు శాస్త్రం మాత్రం తేనెపట్టు ఉంటే దురదృష్టం, కరవు తప్పవని హెచ్చరిస్తోంది. ఇంట్లో, బయట గోడలపై ఎక్కడా తేనెపట్టు లేకుండా చూసుకోవాలని చెబుతోంది. మనం నివసించే ఇంట్లో కాని, ఆఫీసు పరిసరాల్లోనీ కానీ తేనెపట్టు ఉండటం శ్రేయస్కరం కాదు.

తేనెపట్టు పెడితే ఆ ప్రదేశంలో నష్టం జరగబోతోందని సంకేతంగా భావించాలంటున్నారు వాస్తునిపుణులు. సహజంగా తేనెతీగలు నిర్మానుష్యు ప్రదేశాల్లోనే ఎక్కువగా తేనెపట్టు పెడుతుంటాయి. అలికిడి, అలజడి లేని చోట్ల మాత్రమే తేనెటీగలు వస్తాయి. ఇళ్లల్లో మనుషులు ఉంటున్నా అలాంటి తేనెటీగలు వచ్చేయంటే అది అసాధారణమే.

Advertisement

నిర్మానుష్య ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకునే తేనెటీగలు మనుషులున్నా వచ్చాయంటే ఆలోచించాలి. ఒకవేళ ఇంట్లో తేనెపట్టు పెడితే ఆ ఇంటిని కొంతకాలం వదిలేయాలి. మంట పెట్టి ఆ తేనెపట్టును అక్కడ నుంచి తొలగించాలి. పసుపు నీళ్లతో ఇంటిని శుభం చేసుకుని కొన్ని శాంతి హోమాలు, పూజలు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఒకవేళ మనం పనిచేసే ఆఫీసులో కూడా తేనెపట్టు ఉంటే ఆ కంపెనీ ఖ్యాతి పడిపోతు ఉంటుంది. అందులో పనిచేసే వారికి నష్టం జరుగుతుంటుంది. నిధులు ,నిక్షేపాలు దాచిన చోట కూడా తేనెపట్టు పెడుతుంటాయని కొన్ని గ్రంధాల్లో ప్రస్తావించారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×