E-Paper
Advertisement

ISRO:ఇస్రో కొత్త ప్రయోగం.. సూర్యుడిపైకి మిషన్..

ISRO:ఇస్రో కొత్త ప్రయోగం.. సూర్యుడిపైకి మిషన్..
Advertisement

ISRO:ఇప్పటివరకు ఇస్రో.. నక్షత్ర మండలంలోకి, చంద్రుడిపైకి ఎన్నో శాటిలైట్లను పంపించి పరిశోధనలు చేసింది. ఇస్రో చేసిన చాలా వరకు పరిశోధనలు విజయం సాధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త అధ్యాయానాన్ని ప్రారంభించాయి. తాజాగా ఇస్రో ఇప్పటివరకు ఎన్నడూ చేయని ఓ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మొదటిసారిగా సూర్యూడిపై పరిశోధనలు చేయనుంది. ఈ ఏడాది జూన్ లేదా జులై ఆదిత్య ఎల్ 1 అనే సైంటిఫిక్ మిషిన్ పేరుతో సూర్యుడిపై స్టడీ మొదలుకానుంది. ఈ ప్రయోగంలో ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) కూడా భాగంకానుంది. ఆదిత్య ఎల్ 1లో ఆకాశానికే ఎగిరే ముఖ్యమైన టెలిస్కోప్ వెల్క్‌కు టెస్టింగ్ కూడా పూర్తయ్యిందని ఐఐఏ తెలిపింది. ఆ తర్వాత వెల్క్‌ను ఇస్రోకు అందజేసింది.

Advertisement

వెల్క్‌కు సంబంధించిన తదుపరి పరిశోధన ప్రకియ ఇస్రో చేపట్టనుంది. వెల్క్‌ను తయారు చేసిన టీమ్‌ను అభినందించిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. ఆదిత్య ఎల్ 1 లాంచ్ జూన్ లేదా జులైలో ఉంటుందని బయటపెట్టారు. భూమిపై సూర్యుడి ప్రభావం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఆదిత్య ఎల్ 1 ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుందని సోమనాథ్ తెలిపారు.

వెల్క్ తయారు చేయడానికి 15 ఏళ్లు సమయం పట్టిందని తెలిపిన సోమనాథ్.. ఇలాంటి ఒక అరుదైన ప్రయోగానికి ఆ మాత్రం సమయం మామూలే అన్నారు. అంతే కాకుండా ఇస్రోకు, ఐఐఏ కలిసి చేసిన ప్రయోగాల్లో ఇది ముందంజలో ఉంటుందన్నారు. సూర్యుడి గురించి స్టడీ చేయడం కోసం హాలో ఆర్బిట్‌లోకి వెళ్లే మొదటి ఇండియన్ మిషిన్ ఆదిత్య ఎల్ 1. ఈ మిషిన్‌లో ఏడు టెలిస్కోప్‌లు అమర్చబడతాయి. ఇవి సూర్యుడి చుట్టూ ఉన్న ఫోటోస్ఫియర్, క్రోమోస్పియర్, ఔట్‌మెస్ట్ లేయర్స్‌ను గమనించనున్నాయి.

Advertisement

సూర్యుడిపైకి వెళ్లే ఈ మిషిన్ సోలార్ కదలికలను గమనించడంతో పాటు అంతరిక్షంలోని వాతావరణంపై సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా చేయని పరిశోధనలను కూడా భవిష్యత్తులో చేయాలన్న ఆలోచనలో ఉంది ఇస్రో. అందుకే భారతదేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను తమ ఆలోచనలను బయటపెట్టడానికి ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తోంది. వెల్క్ తయారీకి ఐఐఏ, ఇస్రోతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా సహాయాన్ని అందించినట్టు తెలుస్తోంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×