E-Paper
Advertisement

Job Cuts Across The World : ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఇప్పట్లో కోతలు ఆగవా?

Job Cuts Across The World : ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఇప్పట్లో కోతలు ఆగవా?
Advertisement

Job Cuts Across The World : ట్విట్టర్లో మొదలైన ఉద్యోగాల కోత… మెల్లమెల్లగా అన్ని కంపెనీల్లోనూ మొదలవుతోంది. ట్విట్టర్లో ఇప్పటికే దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 13 వేల మందిని తొలగించింది. అమెజాన్ కూడా దశల వారీగా 10 వేల మందిని తొలగించే పని మొదలుపెట్టింది. ఈ కోతలు ఇక అన్ని కంపెనీల్లోనూ మొదలవుతుండటంతో… ఇవి ఇప్పట్లో ఆగవా? అని ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ప‍్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో 83 వేల మంది పనిచేస్తుండగా… వారిలో 4,100 మంది ఉద్యోగుల్ని తొలగించారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇటీవలి త్రైమాసికంలో 13.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించామని, ఈ ఏడాది ఆదాయం 6 శాతం పెరిగిందని చెప్పిన సిస్కో… ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా కొందర్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఇక అమెరికాకు చెందిన యూజ్డ్‌ కార్‌ డీలర్ కంపెనీ కార్వానా కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇటీవల సంస్థ ఆదాయం బాగా దెబ్బతినడం, భవిష్యత్‌పై ఆందోళనలతో… దాదాపు 1,500 మందిని, అంటే మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతం మందిని తొలగించింది. ఇదే కంపెనీ ఈ ఏడాది ఆరంభంలోనూ 2,500 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం… వాడిన కార్లకు డిమాండ్‌ పడిపోవడంతో… కార్వానా షేరు విలువ ఏడాది కాలంలో ఏకంగా 97 శాతం కరిగిపోయింది. దాంతో… కష్టకాలం మొదలైందని ఉద్యోగులందరికీ కంపెనీ ఇ-మెయిల్ పంపింది.

ప్రపంచవ్యాప్తంగా మొదలైన ఉద్యోగాల కోత… దేశీయ సంస్థ జొమాటోకూ పాకింది. ఇటీవలే వరుసగా ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేయడంతో… జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం సిబ్బందిని తీసేయబోతున్నట్లు ప్రకటించింది. నష్టాల్లో ఉన్న సంస్థలో ఖర్చులు తగ్గించి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు… దేశవ్యాప్తంగా ప్రొడక్ట్‌, టెక్నాలజీ, కేటలాగ్‌, మార్కెటింగ్‌ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో తొలగించినట్లు చెబుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×