E-Paper
Advertisement

Jobs: ఎయిమ్స్‌లో 3 వేలకు పైగా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో భారీగా పోస్టులు.. వివరాలు ఇవే..

Jobs: ఎయిమ్స్‌లో 3 వేలకు పైగా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో భారీగా పోస్టులు.. వివరాలు ఇవే..
Advertisement
jobs

Jobs: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-AIIMS. దేశంలోనే ప్రతిష్టాత్మక వైద్య సంస్థ. అనేక రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు సేవలు అందిస్తున్నాయి. తాజాగా, పలు ఎయిమ్స్‌ల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ అయింది.

మొత్తం 3,055 ఖాళీలు. అన్నీ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులే. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్.. నార్‌సెట్‌- 4 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

డిప్లొమా(GNM)తో పాటు రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా, బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ నర్సింగ్‌/ బీఎస్సీ (పోస్ట్‌ సర్టిఫికేట్‌)/ పోస్ట్‌-బేసిక్‌బీఎస్సీ నర్సింగ్‌.. పాస్ అయి ఉండాలి.

స్టేట్‌/ఇండియన్‌ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టర్ అయి ఉండటం తప్పనిసరి.

Advertisement

వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.3000. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400.

నార్‌సెట్‌-4లో వచ్చిన మార్కులతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జీతం: రూ.9300 నుంచి రూ.34800. రూ.4600 గ్రేడ్ పే అదనం.

మొత్తం 3055 ఖాళీల్లో హైదరాబాద్‌లోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 150, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో 117 పోస్టులు బర్తీ చేయనున్నారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×