స్లోవేకియాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. తూర్పు స్లోవేకియా కోసిస్ కు పశ్చిమాన 55 కి.మీ దూరంలో ఉన్న జాబ్లోనోవ్ నాడ్ టర్నౌ సమీపంలోని రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. టన్నెల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 100 మంది గాయపడగా, వారిలో 16 మంది విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫుటేజీలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నట్లు కనిపించాయి. క్రాష్ తర్వాత కొండ వైపు పడి ఉన్న బోగీలు, ముందు భాగం తీవ్రంగా ధ్వంసం అయిన లోకోమోటివ్ కనిపించాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రైల్లో సుమారు 150 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రైళ్లు పట్టాలు దాటుకుని ఒకే లైన్ గా మారే ప్రదేశంలో ఢీకొన్నట్లు వెల్లడించారు. అయితే, ఇలా జరగడానికి కారణం ఏంటి? అనే అంశపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆదేశ మంత్రి మాటస్ సుతాజ్ ఎస్టోక్ వెల్లడించారు. “ ఉదయం 10 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. వీరిలో సుమారు 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో 150 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. వైద్య బృందం బాధితులకు తగిన చికిత్స అందిస్తోంది. వీలైనంత త్వరగా బాధితులు కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఆయన వెల్లడించారు.
🚨Two trains collided in #Slovakia, injuring 20 people.
A train accident occurred in the #Košice Region in eastern Slovakia, involving two trains colliding. According to preliminary reports, at least 20 people were injured. pic.twitter.com/ib294P4qf8
— News.Az (@news_az) October 13, 2025
Read Also: మెట్రో ప్రారంభమైన 3 రోజులకే గుట్కా మరకలు, మరీ ఇలా తయారయ్యారేంట్రా?
ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని కోసిస్ రీజియన్ పోలీస్ డైరెక్టరేట్ సోషల్ మీడియాలో తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు చూసేందుకు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి.
Read Also: ప్రయాణీకురాలి ఫోన్ కొట్టేసిన రైల్వే పోలీసు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?