BigTV English

Shaakuntalam: ‘శాకుంతలం’.. తెర వెనుక కష్టాలు, విశేషాలు..

Shaakuntalam: ‘శాకుంతలం’.. తెర వెనుక కష్టాలు, విశేషాలు..
Shaakuntalam

Shaakuntalam: ఏప్రిల్ 14. శాకుంతలం రిలీజ్. థియేటర్లలో పౌరాణిక పండుగ. అంత ఈజీగా దృశ్య రూపం దాల్చలేదు ఈ ప్రాజెక్ట్. దర్శకుడు గుణశేఖర్ కష్టాలు, నటి సమంత బాధలు ఎన్నో ఈ శాకుంతలంలో దాగున్నాయి.


కొవిడ్ కారణంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యప’ను పక్కనపెట్టి మరీ శాకుంతలం తీశారు గుణశేఖర్.

కాళిదాసు రాసిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ప్రేరణతో ‘శాకుంతలం’ సినిమా రూపకల్పన.


శకుంతల క్యారెక్టర్ సమంతకు పెద్ద సవాల్‌గా నిలిచింది. పౌరాణిక పాత్రలో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి.

సమంతకు పూల అలర్జీ ఉంది. అయినా, పూలు ధరించక తప్పలేదు. చేతికి, మెడకి పూలదండలు చుట్టుకోవడంతో అలర్జీ వచ్చింది. దద్దుర్లతో చాలారోజులు ఇబ్బంది పడింది. ఆ మచ్చలు మేకప్‌తో కవర్ చేయాల్సి వచ్చింది. షూటింగ్ ముగిసే సమయానికి మయోసైటిస్. ఆ అరుదైన వ్యాధితో పోరాడుతూనే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసింది సమంత. ఆ తర్వాత శాకుంతలం ప్రమోషన్స్ కోసం దేశమంతా తిరిగింది. ఈ సినిమా కోసం ఆ శకుంతలానే అనేక కష్టాలు అనుభవించింది సమంత. అందుకేనేమో.. ఏడాదిగా సమంత ఒక యోధురాలిలా ఎంతటి పోరాటం చేస్తుందో బహుశా యావత్‌ ప్రపంచానికి తెలియకపోవచ్చంటూ హీరో విజయ్‌ దేవరకొండ ‘శాకుంతలం’ రిలీజ్ సందర్భంగా ఎమోషనల్‌ లెటర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌, దుర్వాస మహర్షిగా మోహన్‌బాబు, కణ్వ మహర్షిగా సచిన్‌ ఖేడ్కర్‌, మేనకగా మధుబాల, గౌతమి పాత్రలో గౌతమి, అనసూయగా అనన్య నటించారు. కీలకమైన దుర్వాసుడి పాత్రలో మోహన్‌బాబు నటన హైలైట్‌గా ఉంటుందని చెబుతున్నారు.

శకుంతల తనయుడు భరతుడిగా.. హీరో అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం.

ప్రధాన పాత్రధారుల కోసం 14 కోట్లు విలువ చేసే 15 కేజీల బంగారు, వజ్రాభరణాలు వాడారు.

ఓ పాట కోసం సమంత 30 కేజీల బరువున్న లెహెంగా ధరించారు.

14 ప్రముఖ స్టూడియోలు కలిసి శాకుంతలంకు అద్భుతమైన గ్రాఫిక్స్ అందించాయి.

ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్. 5 నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి. ఏడాదిన్నర పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు.

కశ్మీర్‌, అనంతగిరి హిల్స్‌, గండిపేట జలాశయం, రామోజీ ఫిల్మ్‌ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.

సినిమా బడ్జెట్ 80 కోట్లు అంటున్నారు.

ఏప్రిల్ 14న వాల్డ్ వైడ్‌గా థియేటర్లలో శాకుంతలం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×