Malayalam Movies on OTT : మలయాళ సినిమా లవర్స్ కి ఇప్పుడు పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఓటీటీలోకి రాకెట్ లా, మలయాళ సినిమాలు దూసుకొస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ల వరకు, ఈ వారం వచ్చిన లేటెస్ట్ మలయాళ సినిమాలు డబుల్ ధమాకాని ఇస్తున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో సందడి చేస్తున్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమాకి మనోజ్ టి. యాదవ్ దర్శకత్వం వహించారు. ఇందులో రాహుల్ మాధవ్, అలియా, సారత్ అప్పాని, సుధీర్ కరమాణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ కేరళలో ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆ గ్రామంలో తంపాచి, కోమరస్ అనే దేవతలను గ్రామస్తులు చాలా భక్తితో పూజిస్తారు. అదే గ్రామంలో శివ ఒక పెద్ద మనిషిగా ఉంటాడు. అయితే అతని కూతురు శివానికి సిటీలో జాబ్ ఆఫర్ వస్తుంది. శివాని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సిటీలో టైమ్ స్పెండ్ చేస్తుంది. కానీ అక్కడ ఒక మనిషి వల్ల శివాని డేంజర్‌లో పడుతుంది. శివ తన కూతురు కోసం ఆ మనిషిని చంపడంతో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా మనోరమా మాక్స్ లో 2025 అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది IMDB లో 6.5/10 రేటింగ్ ను పొందింది.
అసిఫ్ అలీ, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ సినిమాకి, సేతునాథ్ పద్మకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో అసిఫ్ అలీ మొదటి భార్యతో విడిపోయి, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ ఆమె కూడా డివోర్స్ కోసం ఫాల్స్ డొమెస్టిక్ వయలెన్స్ తో అతని మీద కేసు పెడుతుంది. కోర్టులో లీగల్ ఫైట్స్ మొదలవుతాయి. ఊహించని ట్విస్ట్స్ వస్తాయి. చివర్లో అసలు నిజం బయటపడుతుంది.
ఈ సినిమా ZEE5లో 2025 అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. IMDB లో దీనికి 6.9/10 రేటింగ్ ఉంది.
ఫజిల్ మహమ్మద్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ సినిమాలో శ్రీనాథ్ భాసి, ప్రతాప్ పోతన్ , థెజ్నీ ఖాన్, వానితా కృష్ణచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండే ఒక ముసలి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఒక రోజు అతను ఉండే ఇంట్లోకి, ఒక దొంగ వచ్చి చిక్కుకుపోతాడు. అయితే ఆ ముసలి వ్యక్తి అతన్ని పట్టుకుని పోలీస్‌కు అప్పజెప్పకుండా, అతనితో ముచ్చట్లు చెప్తాడు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ, వాళ్ల మధ్య కూడా ఫ్రెండ్‌షిప్ మొదలవుతుంది. ఆ పెద్దాయన జీవితానికి, ఈ దొంగ ఒక కొత్త వెలుగును ఇస్తాడు. చివర్లో వాళ్లు కలిసి జీవితం గడపాలనుకుంటారు. ఈ సినిమా ఒంటరిగా ఉండే వాళ్ళ ఫీలింగ్స్ ని అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమా థియేటర్లలో 2025 మే 30 న రిలీజ్ అవ్వగా, 2025అక్టోబర్ 13 నుంచి మనోరమా మాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDB లో ఇది 5.8/10 రేటింగ్ పొందింది.
థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాకి అరుణ్ శివ విలాసం దర్శకత్వం వహించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, దివ్యా పిళ్లై, కలభవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ: వినోద్ అనే ఫుడ్ డెలివరీ డ్రైవర్ భార్య వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. ఇది చూసి వినోద్ షాక్ అవుతాడు. అది ఎవరు చేసారో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ సైబర్ క్రైమ్ వరల్డ్‌లో ట్విస్ట్స్ వస్తాయి. చివర్లో వినోద్ తన ఫ్యామిలీని సేవ్ చేస్తాడు. ఈ సినిమా ఆన్‌లైన్ క్రైమ్స్, ఫ్యామిలీ బాండ్ గురించి ఆసక్తికరంగా చూపిస్తుంది. ఈ సినిమా సైనా ప్లే లో 2025 సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో ఉంది.
Read Also : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్