OTT Movie : థియేటర్లని దద్దరిల్లించిన ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ మూవీ ఓటీటీలో కూడా టాప్ లేపుతోంది. దాదాపు వెయ్యి కోట్లతో తెరక్కెక్కిన ఈ సినిమా 5000 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ అమెరికన్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా, 2010లో వచ్చిన యానిమేషన్ సినిమాకు లైవ్ యాక్షన్ రీమేక్ గా వచ్చింది. ఇది వరకే వచ్చిన యానిమేషన్ సినిమా, పిల్లలను ఎంతగానో అలరించింది. ఇప్పుడు యానిమేషన్ డ్రాగన్ లు, రియల్ మనుషులతో కలిపి సరి కొత్త లైవ్ యాక్షన్ తో పిల్లలతో పాటు, పెద్దలని కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ (How to train your dragon) సినిమాకి డీన్ డెబ్లాయిస్ దర్శకత్వం వహించారు. ఇందులో మేసన్ థామస్, టూత్లెస్, జెరార్డ్ బట్లర్, నికో పార్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జూన్ 13న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇది వరకే ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్దతిలో కేవలం ఇంగ్షీషు లో నే అందుబాటులో ఉంది. అక్టోబర్ 13 నుంచి జియో హాట్ స్టార్ లో తెలుగు, తమిళ్, హిందీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది IMDbలో 7.8/10 రేటింగ్ ని కూడా పొందింది.
బెర్క్ అనే ద్వీపంలో వైకింగ్స్, డ్రాగన్స్ మధ్య ఎప్పుడూ పోరాటాలు జరుగుతుంటాయి. హిక్కప్ అనే యువకుడు అక్కడి నాయకుడి కొడుకు. కానీ అతను బలహీనంగా ఉంటాడు. అందరూ అతన్ని ఏమీ చేతగానివాడిగా, చిన్న చూపు చూస్తుంటారు. అతనికి మాత్రం యుద్ధం చేయడం ఇష్టం ఉండదు. అయితే హిక్కప్ కొత్త వస్తువులను తయ్యారు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. అతను ఒక డ్రాగన్‌ను పట్టుకోవడానికి ఒక మెషిన్ తయారు చేస్తాడు. ఆ మెషిన్‌తో అతను టూత్లెస్ అనే నైట్ ఫ్యూరీ డ్రాగన్ న్ పడగొడతాడు.
హిక్కప్, టూత్లెస్ డ్రాగన్ ను చంపకుండా వదిలేస్తాడు. టూత్లెస్ గాయపడి ఉండటంతో దానికి సహాయం కూడా చేస్తాడు. దీంతో వాళ్ల మధ్య స్నేహం మొదలవుతుంది. ఈసమయంలో హిక్కప్, డ్రాగన్స్ చెడ్డవి కాదని తెలుసుకుంటాడు. టూత్లెస్‌తో సమయం గడుపుతూ, డ్రాగన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటాడు. ఇప్పుడు హిక్కప్ తన రాజ్యంలో ఆస్ట్రిడ్ అనే అమ్మాయికి దగ్గరవుతాడు. ఆమె కూడా డ్రాగన్స్ మంచివని నమ్ముతుంది. కానీ ఇంతలోనే బెర్క్‌లో డ్రాగన్స్ దాడులు ఎక్కువవుతాయి.
Read Also : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా
వైకింగ్స్ డ్రాగన్స్‌ను చంపాలని, అవి ఉండే ఇంటిని కనుక్కోవాలని ప్లాన్ చేస్తారు. అయితే హిక్కప్, వైకింగ్స్‌కు డ్రాగన్స్ మంచివని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు వినిపించుకోకుండా డ్రాగన్స్ ఉండే దీవికి వెళ్ళి వాటిని చంపాలని చూస్తారు. అయితే అక్కడ ఒక రాకాసి డ్రాగన్ వీళ్ళపై ఎదురుదాడి చేసి అందరినీ భయపెడుతుంది. ఇక హిక్కప్, టూత్లెస్ సహాయంతో దానిని ఓడిస్తాడు. ఆతరువాత మిగతా డ్రాగన్ లు మనుషులతో స్నేహం చేస్తాయి. ఈ కథకి ఇలా శుభం కార్డ్ పడుతుంది.