Rishab Shetty Pics Of Kantara Climax Shot: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం ‘కాంతార: చాప్టర్ 1′ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్ముదులిపేస్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 600 కోట్లకు చేరువలో ఉంది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక ఒపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా కాంతార: చాప్టర్ 1 నిలిచింది. కేజీయఫ్ని సైతం ఈ సినిమా వెనక్కి నెట్టింది.
అలాగే దేశవ్యాప్తంగా కూలీ, సైయారా, వార్ 2 వంటి చిత్రాలను కూడా దాటేసింది. మూవీ విడుదలైన రెండు వారాలవుతున్న ఇప్పటికీ థియేటర్లలో అదే జోరు చూపిస్తోంది. ఇక ఇదే జోరు కొనసాగితే మాత్రం కాంతార: చాప్టర్ 1 త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. 2022లో వచ్చిన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మించి రెస్పాన్స్ అందుకుంటుంది. పంజుర్లీ సంస్క్రతి బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌కి ఆడియన్స్‌ని విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.
క్లైమాక్స్లో రిషబ్ యాక్టింగ్ గూస్బంప్స్ అనిపించేలా ఉంది. ఈ క్లైమాక్స్ కోసమే ఓ వర్గం ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారు. అంతగా ఆకట్టుకున్న క్లైమాక్స్ షూటింగ్‌కి సంబంధించి రిషబ్ శెట్టి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. షూటింగ్ సెట్లోని ఫోటో షేర్ చేస్తూ.. క్లైమాక్స్ మేకింగ్ ఉన్న కష్టం గురించి వివరించారు. “ఇది క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పటి పరిస్థితి. వాచిన కాళ్లు, అలసిపోయిన శరీరం. కానీ, ఇప్పుడు లక్షలాది మంది ప్రేక్షకుల నుంచి క్లైమాక్స్ సీన్‌పై చూపిస్తున్న ఆదరణ, లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానం ముందు మా ఈ కష్టం చిన్నగా అనిపిస్తోంది.
ఇదంత మేము విశ్వసిస్తున్న దైవిక శక్తి ఆశీర్వాదం ద్వారా మాత్రమే సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మాకు మద్దు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హ్రదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రిషబ్ శెట్టి రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సెట్లో క్లైమాక్స్ సీన్ షూటింగ్ సమయంలో వాచిపోయిన తన కాళ్ల ఫోటోలను షేర్ చేశారు. ఇది బాబోయ్ క్లైమాక్స్ కోసం ఇంత కష్టపడ్డారా? మీ డేడికేషన్కి సినిమా మేకింగ్ పట్ల మీకు ఉన్న నిబద్ధతకు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.